శ్రీలంకతో రెండో టెస్టు: టీమిండియాలోకి అక్షర్ పటేల్‌ ఇన్, కుల్దీప్ యాదవ్‌ అవుట్

India vs Sri Lanka 2nd Test Axar Patel Added to India Squad and Kuldeep Yadav has been Released, India vs Sri Lanka 2nd Test, Axar Patel Added to India Squad, Kuldeep Yadav has been Released From India Squad, India Squad, IND vs SL, India, India Cricket Live News, India Cricket Live Updates, Sri Lanka, Sri Lanka Cricket Live News, Sri Lanka Live Updates, India vs Sri Lanka, India vs Sri Lanka Latest News, India vs Sri Lanka Latest Updates, India vs Sri Lanka Test Match Updates, India vs Sri Lanka Test Match Live Updates, IND vs Sri Lanka 2nd Test Match Latest News, Test Match 2022 Live Updates, Test Match 2022 News, Test Match 2022 Updates, Sri Lanka national cricket team Updates, Sri Lanka national cricket team Live Updates, Cricket, Cricket Latest News, Cricket Latest Updates, Mango News, Mango News Telugu,

భారత్, శ్రీలంక జట్ల మధ్య 2 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా బెంగళూరులో మార్చి 12-16 వరకు రెండో టెస్ట్ జరగనున్న విషయం తెలిసిందే. శ్రీలంకతో జరిగిన మొదటి టెస్టును భారత్ జట్టు కేవలం మూడు రోజుల్లోనే ముగించి ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. రెండో టెస్టులో కూడా సత్తా చాటి సిరీస్ కైవసం చేసుకునేందుకు ఆటగాళ్లు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో రెండో టెస్టు కోసం జట్టులో మార్పులపై బీసీసీఐ మంగళవారం నాడు ఒక ప్రకటన విడుదల చేసింది. అక్షర్ పటేల్‌ కు జట్టులో స్థానం కల్పించారు. రెండవ టెస్ట్ కోసం ఆల్-ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ అక్షర్ పటేల్‌ ను భారత్ జట్టులో చేర్చిందని పేర్కొన్నారు. ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ గాయం నుంచి కోలుకున్నాడని, బీసీసీఐ వైద్య బృందంచే క్లియర్ చేయబడ్డాడని తెలిపారు. దీంతో రెండో టెస్టు కోసం కుల్దీప్ యాదవ్‌ను జట్టు నుంచి తప్పించినట్టు బీసీసీఐ ప్రకటించింది.

రెండో టెస్టుకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), ప్రియాంక్ పంచల్, మయాంక్ అగర్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, హనుమ విహారి, శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), కెఎస్ భరత్, రవీంద్ర జడేజా, జయంత్ యాదవ్, ఆర్. సౌరభ్ కుమార్, మహమ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, మహమ్మద్ షమీ, అక్షర్ పటేల్.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 3 =