రాబోయే కోవిడ్-19 వ్యాప్తిపై సలహాలు జారీ చేసిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్

Indian Medical Association Issues Advisory on Impending COVID Outbreak,Indian Medical Association,Covid-19 Outbreak,Indian Medical Association on Covid-19 Outbreak,Mango News,Mango News Telugu,COVID Outbreak,COVID Outbreak Latest News and Updates,COVID Outbreak News and Live Updates,Indian Medical Association News and Updates,Covid In India,Covid,Covid-19 India,Covid-19 Latest News And Updates,Covid-19 Updates,Covid India,India Covid,Covid News And Live Updates,Carona News,Carona Updates,Carona Updates,Cowaxin,Covid Vaccine,Covid Vaccine Updates And News,Covid Live

ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కోవిడ్-19 కేసుల ఆకస్మిక పెరుగుదల దృష్ట్యా దేశ ప్రజలు వెంటనే కోవిడ్ ప్రవర్తన/నిబంధనలను అనుసరించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు రాబోయే కోవిడ్-19 వ్యాప్తిపై పలు సలహాలు జారీ చేస్తూ ఐఎంఏ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. అందుబాటులో ఉన్న నివేదికల ప్రకారం అమెరికా, జపాన్, దక్షిణ కొరియా, ఫ్రాన్స్ మరియు బ్రెజిల్ వంటి ప్రధాన దేశాల నుండి గత 24 గంటల్లో దాదాపు 5.37 లక్షల కొత్త కేసులు నమోదయ్యాయని తెలిపారు. భారత్‌లో గత 24 గంటల్లో 145 కొత్త కేసులు నమోదవగా, అందులో నాలుగు కేసులు కొత్త చైనా వేరియంట్-బీఎఫ్.7కి చెందినవి ఉన్నాయన్నారు

“పబ్లిక్ మరియు ప్రైవేట్ సెక్టార్‌లో బలమైన మౌలిక సదుపాయాలు, అంకిత భావంతో పనిచేసే వైద్య సిబ్బంది, ప్రభుత్వం నుండి అనుకూలమైన నాయకత్వ మద్దతు మరియు తగినంత మందులు మరియు వ్యాక్సిన్‌ల లభ్యతతో, భారతదేశం గతంలో చేసినట్లుగా ఏదైనా సంఘటనలను నిర్వహించగలుగుతుంది. అత్యవసర మందులు, ఆక్సిజన్ సరఫరా మరియు అంబులెన్స్ సేవలను అందుబాటులో ఉంచడానికి సంబంధిత మంత్రిత్వ శాఖలు మరియు విభాగాలకు అవసరమైన సూచనలను జారీ చేయడం ద్వారా 2021లో కనిపించే అటువంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకు సంసిద్ధతను పెంచాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది” అని తెలిపారు.

“ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తమ ప్రాంతాలలో కోవిడ్ వ్యాప్తి చెందితే అవసరమైన సన్నాహక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మరియు స్థానిక శాఖలకు సలహా జారీ చేసింది. వ్యాప్తిని ఎదుర్కోవడానికి గతంలో చేసిన విధంగా క్రియాశీలకంగా పని చేయాలని ఐఎంఏ తన సభ్యులందరినీ కూడా విజ్ఞప్తి చేస్తుంది. ప్రస్తుతానికి పరిస్థితి ఆందోళనకరంగా లేదు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. వ్యాప్తి చెందాక నివారణ చర్యల కంటే ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం. అందువల్ల, రాబోయే కోవిడ్ వ్యాప్తిని అధిగమించడానికి కొన్ని అవసరమైన చర్యలను తీసుకోవాలని అందరికీ సూచిస్తున్నాం. దేశవ్యాప్తంగా 3.5 లక్షల మంది వైద్య నిపుణులతో కూడిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భయంకరమైన వ్యాధితో పోరాడేందుకు కట్టుబడి ఉంది. ప్రివెన్షన్ మరియు నివారణ చర్యల యొక్క అన్ని కార్యకలాపాలలో ప్రభుత్వానికి పూర్తి సహకారం మరియు భాగస్వామ్యాన్ని అందిస్తామని హామీ ఇస్తున్నాం” అని ఐఎంఏ పేర్కొంది.

రాబోయే కోవిడ్ వ్యాప్తిని అధిగమించడానికి ఐఎంఏ జారీ చేసిన సలహాలు ఇవే:

1. అన్ని బహిరంగ ప్రదేశాల్లో ఫేస్ మాస్క్‌లను ఉపయోగించాలి.
2. భౌతిక దూరం పాటించాలి.
3. సబ్బు మరియు నీరు లేదా శానిటైజర్లతో క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవాలి.
4. వివాహాలు, రాజకీయ లేదా సామాజిక సమావేశాలు మొదలైన బహిరంగ సభలకు దూరంగా ఉండాలి.
5. అంతర్జాతీయ ప్రయాణాన్ని తప్పించుకోండి.
6. జ్వరం, గొంతునొప్పి, దగ్గు, లూజ్ మోషన్స్ మొదలైన ఏవైనా లక్షణాలు ఉంటే వైద్యుడిని సంప్రదించండి.
7. ప్రికాషన్ డోస్ తో సహా మీ కోవిడ్ వ్యాక్సినేషన్‌ను వీలైనంత త్వరగా పొందండి.
8. కాలానుగుణంగా జారీ చేయబడిన ప్రభుత్వ సలహాను అనుసరించండి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 + 18 =