అక్కడ ట్రైన్‌ ఎక్కాలంటే టికెట్‌ అవసరమే లేదు ..!

Indian Railways Offers Free Travel For The Passengers in Bhakra-Nangal Project Route,Indian Railways Offers Free Travel,Free Travel For The Passengers,Bhakra-Nangal Project Route,Free Travel in Bhakra-Nangal Project Route,Mango News,Mango News Telugu,The train, Baghda-Nangal Dam, passengers, Bhagda-Nangal Dam, Himachal Pradesh-Punjab border, travelers,Indian Railways Latest News,Indian Railways Latest Updates,Bhakra Nangal Project Latest News,Bhakra Nangal Project Latest Updates,Indian Railway Free Travel Latest News

సాధారణంగా ఏ ట్రైన్‌ ఎక్కినా టికెట్‌ తీసుకోవడం తప్పనిసరి. సిటీల్లోనైతే ఫ్లాట్‌ఫామ్‌పైకి వెళ్లాలన్నా టికెట్‌ తీసుకోవాల్సిందే. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే ట్రైన్‌ చాలా స్పెషల్‌. ఎందుకంటే ఈ ట్రైన్‌ ఎక్కడానికి అస్సలు టికెట్టే అవసరం లేదు. ఈ ట్రైన్‌ ఉచితంగా ప్రయాణం చేయొచ్చు. అదేంటి..? టికెట్‌ లేకుండా ప్రయాణం ఎలా చేస్తారని చాలామందికి అనుమానం వస్తూ ఉంటుంది.

ప్రతిరోజూ లక్షల మంది ప్రయాణికులను భారతీయ రైల్వే గమ్యస్థానాలకు చేరుస్తోంది. ట్రైన్స్‌లో జనరల్, ఏసీ, స్లీపర్ అంటూ మూడు రకాల టికెట్లు అందుబాటులో ఉంటాయి. కానీ ఈ రైలు ఎక్కితే మాత్రం టికెట్ తీసుకోవాల్సిన అవసరం ఏమాత్రం ఉండదు. భాగ్దా-నంగల్ డ్యామ్ మీద ప్రయాణం చేసే రైలు ప్రయాణికులను ఉచితంగానే వారి వారి గమ్యస్థానాలకు చేరవేస్తోంది. హిమాచల్ ప్రదేశ్-పంజాబ్ సరిహద్దుల్లో భాగ్దా-నంగల్ డ్యామ్ నిర్మించారు. దీన్ని సందర్శించేందుకు సుదూర ప్రాంతాల నుంచి ప్రయాణికులు ప్రతిరోజు వందల సంఖ్యలో వస్తుంటారు.

ఆనకట్టను చూడటానికి, ప్రయాణికులను ఇటువైపు నుంచి అటువైపునకు, అటువైపు నుంచి ఇటువైపునకు తీసుకువెళ్లేందుకు ఈ రైలును నడిపిస్తున్నారు. ఇక ఈ రైలులో ప్రయాణం చేసేందుకు టికెట్టే తీసుకోవాల్సిన అవసరం లేదు. మొత్తం 13 కిలోమీటర్ల దూరం ఉంటుంది. డీజిల్ ఇంజన్ అమర్చారు. దీనికుండే కోచ్‌లను చెక్కతో తయారు చేశారు. సట్లెజ్ నది, శివాలిక్ కొండల గుండా ఇది ప్రయాణిస్తుంది. ప్రతిరోజు 800 మందిని ఈ రైలు ఇక్కడ అందాలను చూపిస్తూ ఉంటుంది.

ఇలా భారతీయ రైల్వే నెట్‌వర్క్ ప్రతిరోజూ కొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఆధునిక సాంకేతికతను అందుబాటులోకి తెస్తోంది. ఇటీవలే దేశవ్యాప్తంగా 508 స్టేషన్ల పునరాభివృద్ధికి ప్రణాళికలు ఆవిష్కరించారు. మరోవైపు ప్రధాన నగరాలను తక్కువ సమయంలో చేరుకునేలా 25 మార్గాల్లో వందే భారత్ రైళ్లను నడిపిస్తోంది. భారతీయ రైల్వే ప్రపంచంలో అతి పెద్ద నెట్ వర్క్ కలిగిన రైల్వేలో నాలుగో స్థానంలో నిలిచింది. వేటికవి ప్రత్యేకంగా నిలిచే రైళ్లు భారతదేశంలో ఎన్నో ఉన్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × four =