షాకింగ్‌ నిజాలు బయటపెడుతోన్న తెలంగాణా ఇంటెన్షన్స్ వరుస సర్వేలు

Telangana Intentions Reveals Shocking Survey Results Ahead of Assembly Polls,Telangana Intentions Reveals,hocking Survey Results,Survey Results Ahead of Assembly Polls,Mango News,Mango News Telugu,Telangana Intentions surveys, BJP, Congress, Congress party, announcement of tickets,seniors, BRS ,plus for Congress,Shocking Survey Results News Today,Shocking Survey Results Latest News,Assembly Polls Latest News,Assembly Polls Latest Updates,Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates,Hyderabad News,Telangana News

వరుసగా మూడోసారి గెలిచి హ్యట్రిక్‌ కొట్టాలని చూస్తున్న బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌.. దానికి తగ్గట్లే వ్యూహాలు రచిస్తున్నారు. బీఆర్ఎస్‌కు 105 సీట్లు వస్తాయని సీఎం కేసీఆర్‌ బల్లగుద్ది మరీ చెబుతున్నారు. అటు మళ్లీ తామే అధికారంలోకి వస్తామని మంత్రులు కూడా పదేపదే చెబుతూ వస్తున్నారు. అయితే వీళ్లు చెప్పేదానికి గ్రౌండ్ లెవల్లో వాస్తవాలకు చాలా తేడాలున్నట్లు తెలంగాణా ఇంటెన్షన్స్ వరుస సర్వేలు చెబుతోన్నాయి. తెలంగాణాలో ప్రజల నాడి ఎలా ఉందనే విషయాన్ని తెలుసుకునేందుకు తెలంగాణా ఇంటెన్షన్స్ ప్రతి వారం సర్వేలు నిర్వహిస్తోంది.

మూడు వారాల నుంచి బయటపడుతున్న ఈ సర్వేలతో.. బీఆర్ఎస్‌ మళ్లీ అధికారంలోకి రావడం సందేహమేనని తేలుతుందట. ఎందుకంటే మెల్లిగా బీఆర్ఎస్ విజయావకాశాలు తగ్గిపోతున్నాయని .. ఇదే సమయంలో కాంగ్రెస్ పుంజకుంటోందని సర్వేలు చెబుతోన్నాయి. పొత్తులు పెట్టుకుని ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా జాగ్రత్తలు తీసుకుంటే కాంగ్రెస్ గెలుపు అవకాశాలు పెరుగుతాయని జనాలు అభిప్రాయపడుతున్నారట. పొత్తులు పెట్టుకుని గట్టిగా పోటీచేస్తే కాంగ్రెస్ ఓటు షేర్ 5 శాతం పెరిగే అవకాశముందని సర్వేలలో తేలింది.

ఇపుడు కాంగ్రెస్ ఓటు షేర్ 29 శాతం ఉందట. పొత్తుల కారణంగా అది 34 శాతానికి పెరుగుతుందని సర్వేలో బయటపడింది. అంటే జనాభిప్రాయం మెల్లిగా కాంగ్రెస్ వైపు మొగ్గుచూపుతున్నట్లు అర్థమవుతోంది. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకే కేసీఆర్ ఎక్కువగా టికెట్లివ్వడమే దీనికి కారణమని తేలింది. ఎందుకంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలపై జనాల్లో బాగా వ్యతిరేకత పెరిగిపోయింది. నేతల అభిప్రాయాలు, జనాల ఆలోచనలను కేసీయార్ పట్టించుకోకుండా మళ్లీ సిట్టింగులకే టికెట్లిచ్చారు. ఆ వ్యతిరేకత పార్టీ నేతల్లోనే కాకుండా జనాల్లో కూడా తాజాగా బయటపడుతోంది.

ఇక ఇదే సమయంలో బీజేపీ అంతగా యాక్టివ్‌గా లేకపోవడంతో జనాల మొగ్గు కాంగ్రెస్ వైపు కనిపిస్తోంది. టికెట్ల ప్రకటన తర్వాత కాంగ్రెస్ పార్టీలో పరిస్ధితులు ఎలాగుంటాయో తెలీదుకానీ… ఇప్పటికైతే సీనియర్లంతా ఏకతాటిపైనే ఉన్నారు. దీన్నే జనాలు కోరుకుంటున్నారట. అందుకనే బీఆర్ఎస్ వ్యతిరేకత అంతా కాంగ్రెస్‌కు ప్లస్సుగా మారుతోంది. ఇదే సమయంలో ఇంకో అవకాశం కూడా కనబడుతోంది. అదేమిటంటే బీఆర్ఎస్‌కు జనాదరణ తగ్గి కాంగ్రెస్‌కు ఆదరణ పెరిగే కొద్ది హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశాలు కూడా పెరుగుతున్నాయి. దీంతో వచ్చే ఎన్నికలపై తెలంగాణ ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here