మైక్రోసాఫ్ట్‌ కీలక నిర్ణయంతో.. కనుమరుగు కానున్న వర్డ్‌ ప్యాడ్‌

Microsoft Plans To Phase Out WordPad Software in Upcoming Windows,Microsoft Plans To Phase Out,WordPad Software in Upcoming Windows,Phase Out WordPad Software,Mango News,Mango News Telugu,Wordpad, IT, Microsoft, Windows 95 software, word pad is going to disappear, Microsofts decision,Microsoft Plans Latest News,Microsoft Plans Latest Updates,WordPad Software Latest News,WordPad Software Latest Updates,WordPad Software Live News,Upcoming Windows Latest Updates

కంప్యూటర్‌ లేదా ల్యాప్‌టాప్‌ వినియోగించే వారందరికీ ఎక్కువగా తెలిసిన టూల్‌ వర్డ్‌ ప్యాడ్‌. ఏవైనా రాసుకోవడానికి, నోట్‌ చేసుకోవడానికి వర్డ్‌ ప్యాడ్‌నే ఎక్కువగా వాడుతూ ఉంటారు. టెక్నాలజీ పెరిగి ఎన్నో టూల్స్‌ అందుబాటులోకి వచ్చినా.. ఇప్పటికీ చాలామంది ఏవైనా టైప్‌ చేసుకోవాలంటే వర్డ్‌ ప్యాడ్‌నే వాడుతుంటారు. అంతలా జనాలకు చేరువైంది వర్డ్‌ ప్యాడ్‌. అయితే.. అలాంటి వర్డ్‌ప్యాడ్‌కు ముగింపు పలకబోతున్నట్లు సంచలన ప్రకటన చేసింది మైక్రోసాఫ్ట్‌. అవును ఇకనుంచి వర్డ్‌ ప్యాడ్‌ టూల్‌ అందుబాటులో ఉండదని వినియోగదారులకు షాక్‌ ఇచ్చింది.

ఇకపోతే.. ఈ వర్డ్‌ ప్యాడ్‌ను ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్టే ప్రవేశపెట్టింది. విండోస్‌ 95 సాఫ్ట్‌వేర్‌తో వర్డ్‌ ప్యాడ్‌ రంగప్రవేశం చేసింది. మూడు దశాబ్దాలుగా ఇది కొన్ని కోట్ల మందికి సేవలందించింది. అయితే ఇక ఇప్పుడు వర్డ్‌ ప్యాడ్‌ కనుమరుగు కానుంది. దీన్ని మనం వినియోగించుకోలేం. 30 ఏళ్లపాటు డాక్యుమెంట్‌ రైటింగ్‌లో అందరికీ ఎంతో ఉపయోగపడ్డ వర్డ్‌ ప్యాడ్‌.. మైక్రోసాఫ్ట్‌ తీసుకుంటున్న నిర్ణయంతో అదృశ్యం కాబోతుంది. అయితే ఇప్పటికే వినియోగంలో ఉన్న విండోస్‌ వెర్షన్లలో వర్డ్‌ ప్యాడ్‌ అందుబాటులో ఉంటుందని మైక్రోసాఫ్ట్‌ స్పష్టత ఇచ్చింది. భవిష్యత్‌లో రాబోయే వర్షన్లలో మాత్రం వర్డ్‌ ప్యాడ్‌ ఉండదని చెప్పింది. ఇప్పుడు అప్లికేషన్స్, సాఫ్ట్‌వేర్‌ ఇలా అన్ని అప్‌ డేట్‌ చేసుకున్నట్టే వర్డ్‌ ప్యాడ్‌ కూడా అప్‌ డేట్‌ చేసుకోవడం కుదరదు. ఇక ఇది కాలగర్భంలో కలసిపోనుంది. వర్డ్‌ ప్యాడ్‌ స్థానంలో మైక్రోసాఫ్ట్‌ వర్డ్‌ను ఉపయోగించుకోవాలని ఆ సంస్థ ఓ ప్రకటనను వెలువరించింది.

మరోవైపు ఇటీవలే సరికొత్త ఆప్షన్లతో నోట్‌ ప్యాడ్‌ను మైక్రోసాఫ్ట్‌ విడుదల చేసింది. దీనికి అప్‌ గ్రేడ్‌ వెర్షన్‌ వదిలింది. నోట్‌ ప్యాడ్‌ను అలాగే ఉంచిన మైక్రోసాఫ్ట్‌ వర్డ్‌ ప్యాడ్‌ను మాత్రం తొలగించడానికి నిర్ణయించింది. దీంతో వర్డ్‌ ప్యాడ్‌ను వాడుతున్న వినియోగదారులు కంగుతిన్నారు. కాగా మైక్రోసాఫ్ట్‌ ఆటోసేవ్, ట్యాబ్‌ ఉపసంహరణ వంటి ఫీచర్లతో నోట్‌ ప్యాడ్‌ను అప్‌ గ్రేడ్‌ చేసినట్టు ఆ సంస్థ ప్రకటించింది. ఇంతలో ఒక్క రోజులోనే వర్డ్‌ ప్యాడ్‌ను తొలగిస్తున్నట్టు ప్రకటించి షాక్‌ ఇచ్చింది.

విండోస్‌ 11లోని విండోస్‌ నోట్‌ ప్యాడ్‌ యాప్‌ను మొదటిసారిగా 2018లో మైక్రోసాఫ్ట్‌ అప్‌ డేట్‌ చేసింది. గత నెలలో ఐవోఎస్, ఆండ్రాయిడ్‌ తర్వాత.. ఇప్పుడు మళ్లీ విండోస్‌ 11లో దాని డిజిటల్‌ అసిస్టెంట్‌ కోర్టానా యాప్‌ సేవలను కూడా నిలిపివేస్తున్నట్టు మైక్రోసాఫ్ట్‌ వెల్లడించింది. ఈ మార్పులనే కాకుండా మైక్రోసాప్ట్‌ ఎక్స్‌ప్లోరర్‌ సెట్టింగ్‌ల సంఖ్యను తగ్గించే ప్రయత్నంలో మైక్రోసాఫ్ట్‌ ఫైల్‌ ఎక్స్‌ప్లోరర్‌లోని ఫోల్డర్‌ ఎంపికల కింద కొన్ని పాత సెట్టింగుల్లో కూడా మార్పులు చేసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 + 10 =