బీజేపీ ఎంపీ, జాతీయ రెజ్లింగ్‌ సమాఖ్య చీఫ్‌పై మహిళా రెజ్లర్ల సంచలన ఆరోపణలు.. జంతర్‌ మంతర్‌ వద్ద కొనసాగుతున్న ధర్నా

Indian Wrestlers Continues Their Stage Protest Against WFI President Brij Bhushan Sharan Singh at Jantar Mantar,Indian Wrestlers Continues,Their Stage Protest,Against WFI President,Brij Bhushan Sharan Singh,Jantar Mantar,Mango News,Mango News Telugu,National Politics News,National Politics And International Politics,National Politics Article,National Politics In India,National Politics News Today,National Post Politics,Nationalism In Politics,Post-National Politics,Indian Politics News,Indian Government And Politics,Indian Political System,Indian Politics 2023,Recent Developments In Indian Politics,Shri Narendra Modi Politics,Narendra Modi Political Views,President Of India,Indian Prime Minister Election

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా భారతీయ రెజ్లర్లు తమ నిరసనను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం రెండోరోజు రెజ్లర్లు వినేష్ ఫోగట్, సాక్షి మాలిక్, బజరంగ్ పునియా మరియు ఇతర రెజ్లర్లు జంతర్ మంతర్ వద్ద మౌన నిరసన కొనసాగిస్తున్నారు. ఇక ఈ ధర్నాలో ఒలింపిక్‌ కాంస్య పతక విజేతలు సాక్షి మాలిక్‌, భజ్‌రంగ్‌ పూనియా, ప్రపంచ చాంపియన్‌షిప్‌ పతక విజేతలు సరితా మోర్‌, సంగీతా ఫొగట్‌, సత్యవర్త్‌ మాలిక్‌, జితేందర్‌, సుమిత్‌ మాలిక్‌ సహా మొత్తం 30 మంది టాప్‌ రెజ్లర్లు పాల్గొన్నారు. డబ్ల్యుఎఫ్‌ఐ ప్రెసిడెంట్ మహిళా రెజ్లర్‌లను ఏళ్ల తరబడి లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నాడని స్టార్ రెజ్లర్, ప్రపంచ చాంపియన్‌షిప్‌ పతక విజేత, ఒలింపియన్‌ అయిన వినేష్ ఫోగట్ బుధవారం ఆరోపించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

టోక్యో ఒలింపిక్ క్రీడల నుండి డబ్ల్యుఎఫ్‌ఐతో విభేదిస్తున్న ఫోగట్, బ్రిజ్‌భూషణ్‌తో పాటు లక్నోలోని జాతీయ శిబిరంలో అనేకమంది కోచ్‌లు మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తమకు రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేస్తూ సహచర రెజ్లర్లతో కలిసి దేశ రాజధానిలోని జంతర్‌మంతర్‌ వద్ద వినేశ్‌ ధర్నాకు దిగింది. గతంలో తానిచ్చిన ఫిర్యాదుల మూలంగా వేధింపులు మొదలయ్యాయని, ఈ క్రమంలో ఒక దశలో తాను ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకున్నానని వినేశ్‌ మీడియా ముందు కంటతడి పెట్టుకోవడంతో సహచర క్రీడాకారులు ఆమెను ఓదార్చారు. ఈ విషయంలో ప్రధానమంత్రి, హోం మంత్రి కలుగజేసుకొని తక్షణమే బ్రిజ్‌ భూషణ్‌ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + four =