భారత్‌లో వెలుగు చూసిన ఒమిక్రాన్ కొత్త వేరియంట్ ‘ఎక్స్ఈ’.. ముంబైలో నమోదైన తొలి కేసు

India's First Case of Corona Virus Variant XE Reported From Mumbai Today, Corona Virus Variant XE, Corona Virus Variant XE First Case, new Covid-19 cases, new Covid-19 cases In India, India Covid-19 Updates, India Covid-19 Live Updates, India Covid-19 Latest Updates, Coronavirus, coronavirus India, Coronavirus Updates, COVID-19, COVID-19 Live Updates, Covid-19 New Updates, Mango News, Mango News Telugu, Omicron Cases, Omicron, Update on Omicron, Omicron covid variant, Omicron variant,, India Department of Health, India coronavirus, India coronavirus News, India coronavirus Live Updates,

భారతదేశంలో కరోనాకు సంబంధించిన రెండు కొత్త వేరియంట్‌లు ముంబైలో నమోదయ్యాయి. దీనిలో ఒమిక్రాన్ సబ్ వేరియంట్‌ ‘ఎక్స్ఈ’ (XE) మొదటి కేసు ఈ రోజు ముంబై నగరంలో నమోదైంది. అలాగే ‘కాపా’ వేరియంట్ యొక్క ఒక కేసు కూడా కనుగొనబడిందని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) ప్రకటించింది. వైరస్ యొక్క కొత్త వైవిధ్యాలతో ఉన్న ఈ రోగులకు ఇప్పటివరకు ఎటువంటి తీవ్రమైన లక్షణాలు లేవు. జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం నమూనాలను పంపిన 230 మంది ముంబై రోగులలో.. 228 మందికి ఒమిక్రాన్ నిర్ధారణ అయింది. ఒకరిలో ‘కాపా’ వేరియంట్‌ను మరోకరిలో ఈ ‘ఎక్స్ఈ’ వేరియంట్‌ను కనుగొన్నారు. అయితే మొత్తం 230 మంది రోగులలో 21 మంది మాత్రమే ఆసుపత్రిలో చేరవలసి వచ్చింది. అయినప్పటికీ వారిలో ఎవరికీ ఆక్సిజన్ లేదా ఇంటెన్సివ్ కేర్ అవసరం లేదని అధికారులు పేర్కొన్నారు. ఆసుపత్రిలో చేరిన వారిలో 12 మంది టీకాలు వేయించుకోలేదని, మరో తొమ్మిది మంది మాత్రం రెండు డోసులను తీసుకున్నారని తెలిపారు.

XE రీకాంబినెంట్ యునైటెడ్ కింగ్‌డమ్‌లో మొదటిసారి జనవరి 19న కనుగొనబడింది. ప్రాథమిక సూచనల ప్రకారం, ఈ వేరియంట్ BA.2 కంటే 10 శాతం వేగంగా వ్యాపించే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్ధ (WHO) తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. కరోనా వైరస్ యొక్క కొత్త వైవిధ్యం ఉద్భవించింది, దీనిని ‘XE’ అని పిలుస్తారు. అత్యంత ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, ఇప్పటివరకు కరోనాలో అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుందని భావిస్తున్న ఒమిక్రాన్ యొక్క సబ్‌వేరియంట్ BA.2 కంటే ఇది పది శాతం ఎక్కువగా వ్యాపించగలదు. అయితే ఇది ప్రస్తుతానికి ప్రపంచవ్యాప్తంగా తక్కువ సంఖ్యలో కేసులను కలిగి ఉండటం ఊరటనిచ్చే విషయం.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six + eight =