జీ20 సదస్సు నిర్వహిస్తోన్న భారత్‌కు కలిగే ప్రయోజనాలు

India Will Gain Multiple Benefits by Hosting G20 Summit 2023,India Will Gain Multiple Benefits,Multiple Benefits by Hosting G20,Hosting G20 Summit 2023,G20 Summit 2023,Mango News,Mango News Telugu,hosting G20 Summit, G20 Summit,India,economic recession, Economic importance, country's progress, infrastructure,G20 Summit 2023 Latest News,G20 Summit 2023 Latest Updates,G20 Summit 2023 Live News,G20 Summit Latest News,G20 Summit Latest Updates

దేశ రాజధాని డిల్లీలో సెప్టెంబర్ 9, 10 తేదీల్లో జరుగుతున్న జీ20 సదస్సుకు.. అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, జపాన్ తదితర దేశాధినేతలతో సహా ఎన్నో దేశాలకు చెందిన ప్రముఖులు వచ్చారు. అయితే అసలు ఈ జీ20 ఏమిటి? దానిని ఎందుకు స్థాపించారు? జీ20 ఢిల్లీలో నిర్వహించడం వల్ల భారత్‌కు ఎలాంటి ప్రయోజనం కలుగుతుందనే ప్రశ్నలు చాలామందిలో తలెత్తుతున్నాయి.

జీ20 అనేది పేరులో ఉన్నట్లుగానే 20 దేశాల కూటమి.1999లో ఆసియాలో ఆర్థిక సంక్షోభం ఏర్పడినప్పుడు.. కొన్ని దేశాల ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్‌లంతా కలిసి ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, దాని సమస్యలపై చర్చించడానికి ఒక వేదికను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 2007లో ప్రపంచమంతటా కూడా ఎకనమిక్ రెసిషన్ ప్రభావం కనిపించింది. అలాంటి పరిస్థితిలో అప్పటివరకూ ఆర్థిక మంత్రుల స్థాయిలో ఉన్న G-20 గ్రూప్‌ను అప్‌గ్రేడ్ చేసి.. దేశాధినేతలతో కూడిన గ్రూప్‌గా మార్చారు.

జీ20 సమావేశంలో.. ఆయా దేశాల కూటమిలోని అధినేతలు పాల్గొంటారు. జీ20 తొలి సమావేశం 2008లో అమెరికాలోని వాషింగ్టన్‌లో జరగగా.. ఇప్పటి వరకు మొత్తం 17 జీ 20 సమావేశాలు జరిగాయి. తాజాగా ఇప్పుడు భారత్ 18వ సమావేశానికి ఆతిథ్యం ఇస్తోంది. జీ-20 ఆర్థిక సమస్యలపై చర్చించడానికి ఏర్పాటైనా కూడా.. రానురాను సుస్థిర అభివృద్ధి, వాతావరణ మార్పు, వ్యవసాయం, ఇంధనం, పర్యావరణం, అవినీతికి అడ్డుకట్ట, ఆరోగ్యం వంటి అంశాలను చర్చించడానికి కూడా వేదికగా మారింది.

జీ20 గ్రూప్‌లో అమెరికా, అర్జెంటీనా, ఆస్ట్రేలియా, రష్యా, సౌదీ అరేబియా, బ్రెజిల్, జర్మనీ, భారత్, బ్రిటన్, ఇండోనేషియా, కెనడా, చైనా, ఫ్రాన్స్, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, దక్షిణాఫ్రికా, తుర్కియేతో కలిపి 19 కంట్రీస్ ఉన్నాయి. యూరోపియన్ యూనియన్ ఈ గ్రూప్‌లో 20వ మెంబర్.కేవలం ఇవే కాకుండా, ప్రతి ఏడాది జీ 20 సదస్సుకు అధ్యక్షత వహించే ఏ దేశమైనా.. కొన్ని దేశాలను అతిథులుగా ఆహ్వానించే అవకాశం ఉంటుంది. అలా ఈసారి బాధ్యతలు చేపట్టిన భారత్.. బంగ్లాదేశ్, ఈజిప్ట్, సింగపూర్, స్పెయిన్, నైజీరియా, ఒమన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌, మారిషస్, నెదర్లాండ్స్ ను ఆహ్వానించింది.

ప్రపంచ జీడీపీలో 85%, అంతర్జాతీయ వాణిజ్యంలో 75 %, ప్రపంచ జనాభాలో 70 % వాటా..ఈ జీ-20 దేశాలదే కాబట్టి.. మన సాంకేతికత గురించి ఈ దేశాలు తెలుసుకోవడానికి ఈ G-20 శిఖరాగ్ర సమావేశం గొప్ప అవకాశంగా మారనుంది. అంతేకాదు భారత దేశం డెవలప్మెంట్, మౌలిక సదుపాయాలు, నైపుణ్యం కలిగిన మనశక్తి గురించి ఆయా దేశాలకు తెలిపేందుకు చాన్స్ ఉంటుంది. అంటే భారత దేశం బలాన్ని, సాధించిన పురోగతిని ప్రపంచానికి తెలియజెప్పడానికి ఇది గొప్ప మార్గంగా చెప్పొచ్చు. అలాగే ఇది భారత్‌కు ఉన్న పాజిటివ్ ఇమేజ్‌ను మరింత బలోపేతం చేస్తుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 1 =