పవన్ కళ్యాణ్ విశాఖ షెడ్యూల్ ఖరారు, 16న పోర్టు కళావాణి ఆడిటోరియంలో జనవాణి కార్యక్రమం

Pawan Kalyan Vizag Tour Schedule Finalized Janavani Program on OCT 16 at Port Kalavani Auditorium, Janasena Chief Pawan Kalyan, Pawan Kalyan to Visit Vizag, Pawan Kalyan Vizag Janavani Program, Pawan Kalyan Janavani Program From OCT 15 To OCT 16, Mango News, Mango News Telugu, Pawan Kalyan Janavani Program, Vizag Janavani Program, Janasena Chief Pawan Kalyan Vizag Tour, Janasena Party, Janasenani AP, AP Janasena Chief Pawan Kalyan, Pawan Kalyan Vizag Janavani Program, Janavani Program Latest News And Updates

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అక్టోబర్ 15వ తేదీ నుంచి మూడు రోజులపాటు ఉత్తరాంధ్ర జిల్లాల పార్టీ కార్యక్రమాలలో పాల్గొననున్నట్టు జనసేన పార్టీ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా పవన్ కళ్యాణ్ విశాఖ షెడ్యూల్ వివరాలపై జనసేన పార్టీ మరో ప్రకటన చేసింది. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ అక్టోబర్ 15వ తేదీ మధ్యాహ్నం విశాఖపట్నం చేరుకుంటారని, అదే రోజు విశాఖపట్నం అర్బన్, రూరల్ పరిధిలోని జనసేన నాయకులతో పార్టీ ప్రణాళికలు, అమలు అంశాలపై సమావేశమవుతారని తెలిపారు.

అక్టోబర్ 16, ఆదివారం ఉదయం 9 గంటలకు విశాఖపట్నంలోని పోర్టు కళావాణి ఆడిటోరియంలో ఉత్తరాంధ్ర జిల్లాల ‘జనవాణి’ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల నుంచి సమస్యలపై వచ్చే అర్జీలను పవన్ కళ్యాణ్ స్వయంగా స్వీకరించి, సమస్యల గురించి తెలుసుకుంటారని తెలిపారు. 16వ తేదీ సాయంత్రం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నాయకులు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు. ఇక అక్టోబర్ 17, సోమవారం ఉదయం విలేఖర్ల సమావేశంలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారని, అనంతరం బీచ్ రోడ్డులోని వై.ఎం.సీ.ఏ హాల్లో ఉమ్మడి విజయనగరం జిల్లా నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలతో కూడా సమావేశమవుతారని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here