కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై పరువు నష్టం కేసు.. ఏప్రిల్‌ 1న విచారణ చేపడతామన్న మహారాష్ట్రలోని భివాండీ కోర్టు

Maharashtra'S Bhiwandi Court Says Hearing Of Defamation Case Against Congress MP Rahul Gandhi Adjourned To April 1,Maharashtra'S Bhiwandi Court Defamation Case,Defamation Case Against Congress MP Rahul Gandhi,Bhiwandi Court Defamation Case Adjourned To April 1,Mango News,Mango News Telugu,Hearing Of Defamation Case Against Rahul ,Defamation Case Against Rahul,Latest Indian Political News,National Political Parties,Indian Political News Live Updates,MP Rahul Gandhi News,Rahul Gandhi Live News,Rahul Gandhi Latest News Updates,Congress MP Rahul Gandhi

మహారాష్ట్రలోని భివాండీ పట్టణ జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై పరువు నష్టం కేసు విచారణను ఏప్రిల్ 1కి వాయిదా వేసింది. అలాగే ఈ కేసు విచారణలో వ్యక్తిగత హాజరు నుండి శాశ్వత మినహాయింపు కోసం ఆయన చేసిన అభ్యర్థనను కూడా వాయిదా వేసింది. ఈమేరకు శనివారం దీనిపై రాహుల్‌ గాంధీ దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా ఏప్రిల్‌ 1న విచారణ జరపనున్నట్లు కోర్టు తెలిపింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ తరపు న్యాయవాది నారాయణ్ అయ్యర్, శాశ్వత మినహాయింపు కోసం దరఖాస్తును ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఎల్‌సి వాడేకర్ ముందు ఉంచారు. రాహుల్ గాంధీ ఢిల్లీలో నివాసం ఉంటున్నందున మరియు లోక్‌సభ సభ్యుడిగా ఉన్నందున హాజరు నుండి మినహాయింపు ఇవ్వాలని, ఈ కేసులో అవసరమైనప్పుడు, విచారణలో తన తరఫున న్యాయవాదిని వాదించడానికి అనుమతించాలని అభ్యర్థించారు.

ఇక మరోవైపు దీనిపై ఫిర్యాదుదారు తరఫు న్యాయవాది నందు ఫడ్కే స్పందిస్తూ.. ఏప్రిల్ 1న తదుపరి విచారణకు రానున్న ఈ కేసు విచారణకు తాము సిద్ధంగా ఉన్నామని శనివారం కోర్టుకు తెలియజేశారు. కాగా రాహుల్‌గాంధీ 2014లో థానే జిల్లాలోని భివాండి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తూ.. మహాత్మా గాంధీ హత్య వెనుక రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్‌) హస్తం ఉందని ఆరోపించారు. దీనిపై స్థానిక ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త రాజేష్ కుంతే, రాహుల్ గాంధీపై పరువు నష్టం దావా వేశారు. ఎన్నికల ర్యాలీలో రాహుల్ గాంధీ ప్రసంగాన్ని విన్న తర్వాత రాజేష్ కుంతే, భివాండి పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × two =