ఒమిక్రాన్‌ సైలెంట్‌​ కిల్లర్‌.. సీజేఐ ఎన్‌వీ రమణ ఆసక్తికర వ్యాఖ్యలు

Omicron A Silent Killer As Recovery Takes Long Says CJI NV Ramana, Omicron A Silent Killer As Recovery Takes Long, CJI NV Ramana Says Omicron A Silent Killer As Recovery Takes Long, Omicron A Silent Killer, CJI NV Ramana, India Covid-19 Updates, India Covid-19 Latest Updates, Coronavirus, coronavirus India, Coronavirus Updates, COVID-19, COVID-19 Live Updates, Covid-19 New Updates, Mango News, Mango News Telugu, Omicron Cases, Omicron, Update on Omicron, Omicron covid variant, Omicron variant,

సుప్రీంకోర్టులో భౌతిక విచారణలకు పూర్తి స్థాయిలో హాజరు కావాలని చేసిన అభ్యర్థనపై భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వీ రమణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కేసులు తగ్గినా సరే ఒమిక్రాన్‌ను తేలికగా తీసుకోవద్దని సూచించారు. ఈ క్రమంలో ఒమిక్రాన్‌ను “సైలెంట్‌ కిల్లర్” గా సంబోధించారు. దాదాపు ఒక నెల క్రితం తాను కూడా ఈ వైరస్‌ బారిన పడ్డానని గుర్తుచేశారు. “ఒమిక్రాన్‌ ఒక సైలెంట్ కిల్లర్. మీకు తెలుసా.. నేను మొదటి వేవ్‌లో బాధపడ్డాను. కానీ, నాలుగు రోజుల్లో కోలుకున్నాను. అయితే, ఇప్పుడు ఈ వేవ్‌లో మాత్రం 25 రోజులు గడచినా నేను ఇంకా బాధపడుతున్నాను” అని చీఫ్ జస్టిస్ ఎన్‌వీ రమణ అన్నారు. కాగా, కేసులు తగ్గుముఖం పట్టడంతో పూర్తి భౌతిక విచారణకు తిరిగి రావాలని సుప్రీం కోర్ట్ బార్ అసోసియేషన్‌కు నేతృత్వం వహిస్తున్న సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ సుప్రీంకోర్టును అభ్యర్థించిన నేపథ్యంలో సీజేఐ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం వారానికి రెండుసార్లు భౌతిక విచారణలు మరియు మిగిలినవి ఆన్‌లైన్‌లో ఉన్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 2 =