కరోనా వ్యాప్తి: ఉద్యోగులు పాటించాల్సిన కొత్త మార్గదర్శకాలు

Centre Govt Covid Guidelines, Centre Govt Issues New Covid Guidelines, Centre issues guidelines for government officers, coronavirus india live updates, Covid Guidelines, Covid Guidelines for Govt Employees, Govt issues fresh Covid guidelines, New Covid Guidelines for Govt Employees

దేశంలో కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి రోజురోజుకి మరింతగా విజృంభిస్తుంది. ఈ క్రమంలో పలువురు కేంద్ర ప్రభుత్వ అధికారులు, సిబ్బంది కూడా కరోనా బారిన పడుతున్నారు. ఈ నేపధ్యంలోనే కేంద్ర ప్రభుత్వం తాజాగా పలు మార్గదర్శకాలను జారీ చేసింది. కార్యాలయాల్లో కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేలా ఈ మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

కేంద్ర ప్రభుత్వ అధికారులు, సిబ్బంది పాటించాల్సిన మార్గదర్శకాలు:

  • ఎలాంటి కరోనా లక్షణాలు లేని సిబ్బందిని మాత్రమే అనుమతించాలి. ఎవరికైనా తేలికపాటి దగ్గు లేదా జ్వరం ఉన్న కూడా ఇంట్లో ఉండాలి.
  • కంటైన్మెంట్ జోన్‌లో నివసించే అధికారులు / సిబ్బంది కార్యాలయానికి రాకూడదు. కంటైన్మెంట్ డి-నోటిఫికేషన్ వచ్చేవరకు ఇంటి నుండి మాత్రమే పనిచేయాలి.
  • ఒక రోజులో 20 కంటే ఎక్కువ మంది సిబ్బంది / అధికారులు కార్యాలయానికి హాజరు కాకూడదు. రోస్టర్ విధానానికి అనుగుణంగా హాజరుకావాలి. మిగిలిన సిబ్బంది ఇంటి నుండి పని చేయాలి.
  • సెక్రటరీలు/డిప్యూటీ సెక్రటరీలు క్యాబిన్ పంచుకుంటే వారు భౌతిక దూరాన్ని పాటించాలి.
  • ఏ విభాగంలోనైనా ఒకేసారి ఇద్దరు అధికారులు ఉండకూడదు, కార్యాలయంలో ఏ సమయంలోనైనా 20 మందికి మించకుండా సిబ్బంది ఉండేలా కార్యాలయంలో ఏర్పాట్లు చేసుకోవాలి. గదులలో సరైన వెంటిలేషన్ ఉండేలా వీలైనంతవరకు కిటికీలు తెరిచి ఉంచవచ్చు.
  • కార్యాలయ ప్రాంగణంలో అన్ని సమయాల్లో ఫేస్ మాస్క్ మరియు ఫేస్ షీల్డ్ ధరించాలి. కార్యాలయంలో మాస్కు ధరించే ప్రోటోకాల్ పాటించలేదని తేలితే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటారు.
  • ఉపయోగించిన మాస్క్ మరియు గ్లోవ్స్ ను పసుపు రంగు బయో మెడికల్ వేస్ట్ బిన్‌లో మాత్రమే జాగ్రత్తగా వేయాలి, ఈ నిబంధనను ఉల్లంఘించే వ్యక్తులపై కఠినమైన చర్యలు తీసుకోబడతాయి.
  • ఫేస్ టూ ఫేస్ మీటింగ్స్, డిస్కషన్స్ లాంటివి వీడియో కాన్ఫరెన్స్, ఫోన్ ద్వారా పెట్టుకోవాలి.
  • కరోనా సంక్రమణ జరగకుండా ఉండటానికి ప్రతి అరగంటకి ఓసారి చేతులు కడుక్కోవడం తప్పనిసరి. కారిడార్లలోని ప్రముఖ ప్రదేశాలలో హ్యాండ్ సానిటైజింగ్ డిస్పెన్సర్‌లను ఏర్పాటు చేయాలి.
  • ఎలక్ట్రిక్ స్విచ్‌లు, డోర్ నాబ్స్, ఎలివేటర్ బటన్లు, హ్యాండ్ రైల్స్, వాష్‌రూమ్ ఫిక్చర్స్ వంటి తరచుగా తాకే ప్రదేశాలను ప్రతి గంటకొకసారి 1% సోడియం హైపోక్లోరైట్‌తో ద్రావణంతో శుభ్రం చేయాలి. అధికారులు / సిబ్బంది తమకు సంబంధించిన పరికరాలైన కీబోర్డులు, మౌస్, ఫోన్లు, ఎసి రిమోట్లు మొదలైన వాటిని ఏదైనా ఇథనాల్ ఆధారిత డిసిన్ఫెక్ట్స్ ఉపయోగించి తరచుగా శుభ్రం చేసుకోవాలి.
  • కూర్చున్నప్పుడు లేదా నడుస్తున్నప్పుడు ఒక మీటర్ దూరం పాటించాలి. అధికారుల క్యాబిన్లలోని విజిటర్స్ కుర్చీలను భౌతిక దూరం నిబంధనలను పాటిస్తూ ఏర్పాటుచేయాలి.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − eleven =