దేశవ్యాప్త నిరసనలకు రైతులు సిద్ధం కావాలి.. ప్రముఖ రైతు నేత రాకేష్ టికాయత్

ప్రముఖ రైతు సంఘాల నాయకులు మరోసారి దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు. గతేడాది వ్యవసాయ చట్టాల రద్దు సందర్భంగా రైతు సమస్యలపై జారీ చేసిన లేఖలోని ఏ హామీని ఇంతవరకూ అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం రైతులను మోసం చేసిందని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేష్ టికాయత్ ఆదివారం ఆరోపించారు. అందుకు నిరసనగా సోమవారం సంయుక్త కిసాన్ మోర్చా, బీకేయూ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ‘ద్రోహ దినం’ పేరిట ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

గతేడాది డిసెంబరు 9న కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకే సరిహద్దు వెంబడి ఒక సంవత్సర కాలంగా కొనసాగిన నిరసనలను ఉపసంహరించుకున్నామని, అయితే వాటిని నెరవేర్చడం లేదని టికాయత్ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలంటూ 2020 నవంబర్ లో రైతులు ఆందోళనలు ప్రారంభించిన విషయం తెలిసిందే. దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో ఏడాదికి పైగా నిరసనలు కొనసాగించారు. ఎట్టకేలకు ఆ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు గతేడాది నవంబర్ లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.

ఈ క్రమంలోనే.. నిరసనల సమయంలో రైతులపై నమోదు చేసిన కేసుల ఉపసంహరంణ మరియు కనీస మద్దతు ధరపై కమిటీ ఏర్పాటుతో పెండింగ్ లో ఉన్న డిమాండ్ల పరిష్కారానికి అంగీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం.. రైతు సంఘాల నాయకులకు లేఖ పంపింది. దీంతో రైతులు గతేడాది డిసెంబరులో ఢిల్లీ సరిహద్దులను ఖాళీ చేశారు. కానీ ఆ హామీలను అమలు చేయడం లేదని తాజాగా మరోసారి నిరసనలకు దిగనున్నారు రైతులు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 + 3 =