గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకున్న ఆర్‌ఆర్‌ఆర్, చిత్ర బృందానికి ప్రధాని మోదీ సహా పలువురు రాజకీయ నేతల అభినందనలు

PM Modi and Other Political Leaders Congratulates RRR Team Over Golden Globe Award Wins,RRR's Naatu Naatu Song Wins Golden Globes 2023,Golden Globes 2023,Mango News,Mango News Telugu,Best Original Song Naatu Naatu Song,Music Director Keeravani,Keeravani Receives Golden Globe Award,RRR Wins Golden Globe Award,Best Original Song Category,Best Original Song Naatu Naatu,Future Of Young India,Mega Power Star Ram Charan,Mega Power Star,S.S.Rajamouli,RRR,Rise Roar Revolt,Ram Charan Latest News and Updates,Ram Charan News and Live Updates,Ram Charan Latest Movie Updates

తెలుగు సినిమా ‘ఆర్‌ఆర్‌ఆర్’ ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఆర్‌ఆర్‌ఆర్ టీమ్‌కు అభినందన సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. దీనిలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు రాజకీయ నాయకులు ఆర్‌ఆర్‌ఆర్ చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. వీరిలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తదితరులు ఉన్నారు.

దీనిపై ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా.. ‘గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకున్నందుకు ఆర్‌ఆర్‌ఆర్ బృందానికి ప్రత్యేక అభినందనలు. ఈ ప్రతిష్టాత్మకమైన గౌరవం ప్రతి భారతీయుడిని ఎంతో గర్వించేలా చేసింది. దీనిలో భాగమైన దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి, నటులు జూ.ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లకు అభినందనలు. అలాగే ఈ పాటకు కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్, గాయకులు కాల భైరవ, రాహుల్ సిప్లిగంజ్, లిరిసిస్ట్ చంద్రబోస్ లను కూడా నేను అభినందిస్తున్నాను’ అని పేర్కొన్నారు.

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు.. ‘ఆర్.ఆర్.ఆర్. చిత్రంలోని “నాటు.. నాటు..” గీతానికి ప్రపంచ ఖ్యాతి దక్కటం తెలుగు వారందరికీ గర్వకారణం. ఈ గీతానికి గాను ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకున్న సంగీత దర్శకుడు కీరవాణి సహా ఆర్.ఆర్.ఆర్. చిత్ర బృందానికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను’ అని పేర్కొన్నారు.

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తన ట్విట్టర్ లో ఇలా తెలిపారు.. ‘ నాటు నాటుతో ఉత్తమ ఒరిజినల్ పాటగా ఆర్ఆర్ఆర్ గోల్డెన్ గ్లోబ్‌ను గెలుచుకోవడం నిజంగా అద్భుతమైన వార్త. దీని ద్వారా మన స్థానిక సంగీతం మరియు పాటలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తమయ్యాయి. మొత్తం టీమ్ కు అభినందనలు. ఆర్ఆర్ఆర్ ఇలాంటి మరిన్ని అంతర్జాతీయ ప్రశంసలు అందుకోవాలని కోరుకుంటున్నాను.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీనిపై ట్విట్టర్ లో స్పందిస్తూ.. తెలుగు జెండా రెపరెపలాడుతోంది! ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరి తరపున, చిత్ర బృందాన్ని నేను అభినందిస్తున్నాను’ అని తెలియజేశారు.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన ట్విట్టర్ వేదికగా.. ‘ఆర్ఆర్ఆర్ మూవీ ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో గోల్డెన్ గ్లోబ్స్ అవార్డును గెలుచుకున్నందుకు చిత్ర బృందానికి అభినందనలు. నేను ముందే చెప్పినట్లు తెలుగు ఇప్పుడు భారతీయ మృదు శక్తి భాషగా మారింది. దీని పట్ల చాలా గర్వంగా ఉంది!’ అని తెలియజేశారు.

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ దీనిపై స్పందిస్తూ.. ‘గోల్డెన్‌ గ్లోబ్స్ లో ఉత్తమ ఒరిజినల్ సాంగ్ గెలిచినందుకు ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి హృదయపూర్వక అభినందనలు. ఈ చారిత్రాత్మక విజయంతో మీరు భారతదేశాన్ని ప్రపంచ వేదికపై గర్వపడేలా చేశారు’ అని అన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + fourteen =