నేడు ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్‌ భేటీ.. కేసీఆర్‌, కేజ్రీవాల్, మమతా సహా పలువురు సీఎంలు గైర్హాజరు

PM Modi To Chair Niti Aayog Meet Today 6 CMs Along with KCR Kejriwal Mamata Banerjee and Others To Skip,PM Modi To Chair Niti Aayog Meet Today,Niti Aayog Meet Today,6 CMs To Skip Niti Aayog Meet,Kejriwal To Skip Niti Aayog Meet,Mamata Banerjee Along with KCR To Skip,Mango News,Mango News Telugu,PM Modi to chair 8th NITI Aayog meet today,6 Chief Ministers Skip NITI Aayog Meeting,Six CMs to skip Niti Aayog meeting,Indian Prime Minister Narendra Modi,Narendra modi Latest News and Updates,Latest Indian Political News,Niti Aayog Meet Latest news,Niti Aayog Meet Latest Updates

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన దేశ రాజధాని న్యూఢిల్లీలో శనివారం నీతి ఆయోగ్‌ 8వ పాలక మండలి సమావేశం జరుగనుంది. ఈ భేటీకి బీజేపీయేతర పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పలువురు గైర్హాజరు అవుతున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆప్ పాలిత రాష్ట్రాల సీఎంలు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్ సహా మొత్తం ఆరుగురు ముఖ్యమంత్రులు ఈ సమావేశాలను బహిష్కరించారు. రేపు కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవాన్ని 21 ప్రతిపక్ష పార్టీలు బహిష్కరించాలని నిర్ణయించిన తరుణంలో వీరు నేడు జరిగే నీతి ఆయోగ్ సమావేశాలను బహిష్కరించడం గమనార్హం. కాగా నేటి సమావేశంలో 2047 నాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే లక్ష్యంతో చేపట్టాల్సిన చర్యలు, అనుసరించాల్సిన విధానాలపై కూలంకుషంగా చర్చించనున్నారు. దీనిలో భాగంగా ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి, మహిళా సాధికారత, మౌలిక సదుపాయాల కల్పన వంటి తదితర అంశాలపై అభిప్రాయాలు సేకరించనున్నారు. ఇక ఈ సమావేశంలో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్ర మంత్రులు మరియు వివిధ శాఖల అధిపతులు పాల్గొననున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here