ఏపీలో రాజకీయంగా సంచలనం సృష్టించడానికే సీఎం జగన్‌ పేరు ప్రస్తావన – సీబీఐపై సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్

AP Govt Advisor Sajjala Ramakrishna Reddy Fires on CBI Over CM Jagans Name Mentioned in YS Viveka Case,AP Govt Advisor Sajjala Ramakrishna Reddy,Sajjala Ramakrishna Reddy Fires on CBI,CM Jagans Name Mentioned in YS Viveka Case,Sajjala Fires on CBI Over CM Jagans Name Mentioned,Mango News,Mango News Telugu,Jagan government denies interfering with CBI,Sajjala Ramakrishna Reddy Comments,AP Govt Advisor Sajjala Latest News,Sajjala Ramakrishna Reddy News Today,Sajjala Ramakrishna Reddy Latest news,Sajjala Ramakrishna Reddy Latest Updates,YS Viveka Case,YS Viveka Case Latest News

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకి సంబంధించి అనూహ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పేరును సీబీఐ ప్రస్తావించడం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలమైంది. శుక్రవారం తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన అదనపు కౌంటర్ అఫిడవిట్‌లో సీఎం జగన్ పేరును చేర్చడం తెలిసిందే. ఈ వ్యవహారం ఇప్పుడు ఏపీ అంతటా తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. ప్రతిపక్షాలు దీనిపై వైసీపీ ప్రభుత్వం మరియు సీఎం జగన్ సమాధానం చెప్పాలని పట్టుబడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. సీబీఐ సీఎం జగన్‌ పేరు ప్రస్తావించడంపై మండిపడ్డారు.

ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. సీబీఐ సీఎం జగన్‌ పేరు ప్రస్తావించడం వెనక పెద్ద కుట్ర ఉందని, ఈ భారీ కుట్ర వెనుక ఎవరున్నారో తేల్చాల్సిన అవసరం ఉందన్నారు. సీబీఐ విపరీత ధోరణికి, సెన్సేషనలైజేషన్‌కు ఇది నిదర్శనమన్న ఆయన సీబీఐ దిగజారిపోయి వ్యవహరిస్తోందని విమర్శించారు. వివేకా హత్య కేసులో మొదటినుంచి ఎంపీ అవినాష్‌ రెడ్డిని టార్గెట్ చేస్తూ వచ్చారని, ఇక ఇప్పుడు సీఎం జగన్‌ను కూడా టార్గెట్‌ చేశారని ఆరోపించారు. సీబీఐ కావాలనే ఒక పద్ధతి ప్రకారం, ముందుగా నిర్దేశించుకున్న ఏజెండా ప్రకారం దర్యాప్తు కొనసాగిస్తోందని, దీనిని తొలినుంచి తాము ఖండిస్తున్నామని తెలిపారు. ఏదైనా ఒక కేసులో దర్యాప్తు సంస్థ ఏదైనా మెన్షన్‌ చేస్తే దానికి ఆధారాలు చూపిస్తుందని, అయితే ఇక్కడ అదేమీ జరగలేదని చెప్పారు. ఇక సీబీఐ ఏం చేయాలనుకుంటుందో కొన్ని మీడియా సంస్థలకు ముందే ఎలా తెలుస్తోందని ప్రశ్నించిన సజ్జల.. కోర్టులో సీబీఐ కౌంటర్‌ వేయకుముందే దానిలో పొందుపరిచే అంశాలను ముందుగానే ఆయా మీడియాల్లో ప్రచారం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో సీబీఐ ఆ అంశాలను ప్రస్తావించగానే మేం ముందుగానే చెప్పాం కదా అని అంటున్నారని, ఇదంతా ఒక ప్రణాళిక ప్రకారం సాగిపోతోందని మండిపడ్డారు. సీబీఐ తీరులో విపరీత ధోరణి, అత్యంత అన్యాయమైన తీరు కనిపిస్తోందని, ఉన్నట్టుండి సడన్‌గా సీఎం జగన్ పేరును ప్రస్తావించడమే దీనికి నిదర్శనమని అన్నారు. అయితే దీనికి వాళ్లదగ్గర ఆధారమేదీ కనిపించడంలేదని, ఇది కేవలం చిల్లర చేష్ట మాదిరిగా ఉందని వ్యాఖ్యానించారు. సీబీఐ కౌంటర్‌ అఫిడవిట్‌ విషయం తెలియగానే, టీడీపీ పొలిట్‌ బ్యూరోలో దీనిపై చర్చించడం, ఈ కేసులో ముఖ్యమంత్రి పాత్ర గురించి అందరికీ తెలుసంటూ వారు ఆరోపణలు చేయడం.. ఇదంతా ఒక గొలుసుకట్టు మాదిరిగా వ్యవహారం నడుస్తోందని, దీనివెనుక ఎవరున్నారో ముందు వారిని అరెస్ట్ చేయాలని కోరారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here