టోక్యో ఒలింపిక్స్‌: భారత్‌ నుంచి వెళ్లే క్రీడాకారులతో మాట్లాడనున్న ప్రధాని నరేంద్ర మోదీ

Indian Athletes, Indian Athletes Contingent Bound, Indian Athletes Contingent Bound for Tokyo Olympics, Mango News, PM Modi to Interact with Indian Athletes, PM Modi to Interact with Indian Athletes Contingent Bound for Tokyo Olympics, PM Modi to Interact with Indian Athletes Contingent Bound for Tokyo Olympics on July 13th, PM Modi to interact with Tokyo-bound athletes, PM Narendra Modi to interact, Tokyo 2020, Tokyo Olympics, tokyo olympics 2021, Tokyo Olympics 2021 India

జపాన్‌ లోని టోక్యో నగరంలో జూలై 23, 2021 నుంచి ఆగస్టు 8, 2021 వరకు ఒలింపిక్స్‌ క్రీడలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టోక్యో ఒలింపిక్స్‌ కు భారత్‌ నుంచి వెళ్లే క్రీడాకారులుతో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ జూలై 13, మంగళవారం సాయంత్రం 5 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్నారు. క్రీడాకారులు ఒలింపిక్స్‌ క్రీడల్లో పాల్గొనే ముందు వారికి ప్రేరణను అందించడం, స్ఫూర్తి నింపడంలో భాగంగా ప్రధాని మోదీ వారితో మాట్లాడనున్నట్టు ప్రధానిమంత్రి కార్యాలయం వెల్లడించింది. ఇటీవలే టోక్యో-2020 ఒలింపిక్స్‌ కి వెళ్తున్న భారత్ ఆటగాళ్లకు సంబంధించిన సౌకర్యాల సన్నాహాలపై ప్రధాని సమీక్ష నిర్వహించారు. అదేవిధంగా మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడుతూ క్రీడాకారులను హృద‌య‌పూర్వకంగా సమర్థించాలంటూ దేశ ప్రజలకు ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. ఇక రేపు జరిగే కార్యక్రమంలో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకుర్, కేంద్ర క్రీడా శాఖ సహాయమంత్రి నిషిత్ ప్రమాణిక్, లా మరియు జస్టిస్ శాఖ మంత్రి కిరెన్ రిజిజూ లు కూడా హాజరుకానున్నారు.

ఈసారి భారత్ నుంచి 18 క్రీడా విభాగాలలో మొత్తం 126 మంది క్రీడాకారులు టోక్యో ఒలింపిక్స్‌ కు బయలుదేరి వెళ్లనున్నారు. ఒలింపిక్ క్రీడోత్సవాలలో ఇప్పటివరకు భారత్ నుంచి వెళ్లిన దళాలన్నిటిలోకీ ఇదే అతి పెద్ద దళం. 18 వేరు వేరు క్రీడా విభాగాలలో మొత్తం 69 పోటీలలో భారత్ ఆటగాళ్లు పాల్గొననున్నారు. అలాగే వివిధ ఆటలలో భారత్ తరఫున ఆటగాళ్లు మొదటిసారి పాల్గొనడం జరుగుతుందన్నారు. ఫెన్సింగ్‌ విభాగంలో భవానీ దేవి, సెయిలర్‌ గా నేత్ర కుమారన్‌, స్విమ్మింగ్‌ విభాగంలో సాజన్‌ ప్రకాశ్‌, శ్రీహరి నటరాజ్‌ లు భారత్ తరపున ఆయా విభాగాల్లో తొలిసారిగా పాల్గొంటునట్టు తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 + four =