వచ్చే నెలలో అమెరికా పర్యటనకు ప్రధాని మోదీ.. వైట్‌హౌస్‌లో డిన్నర్‌ ఏర్పాటు చేయనున్న అధ్యక్షుడు జో బిడెన్

PM Modi To Visit US in Next Month President Joe Biden and First Lady Jill Biden Will Host State Dinner at White House,PM Modi To Visit US in Next Month,President Joe Biden and First Lady Jill Biden Will Host,Host State Dinner at White House,Mango News,Mango News Telugu,President Joe Biden,First Lady Jill Biden,PM To Visit US On June 22,Joe Biden to host state dinner for PM Modi,PM Modi To Visit US On June 22,PM Modi Latest News And Updates,Joe Biden Latest News And Updates

ప్రప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెలలో జూన్ 22న అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఆహ్వానం మేరకు ఆయన ఈ పర్యటనకు వెళ్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వ వర్గాలు బుధవారం ఒక ప్రకటనలో తెలిపాయి. ఈ సందర్భంగా జో బిడెన్ మరియు ఆయన సతీమణి, అమెరికా ప్రథమ మహిళ జిల్ బిడెన్ ప్రధాని మోదీకి ప్రత్యేక విందును ఏర్పాటు చేయనున్నారు. ఈ విషయాన్ని వైట్‌హౌస్ వర్గాలు వెల్లడించాయి. జూన్ 22న ప్రధాని మోదీ కోసం వైట్‌హౌస్‌లో అధికారిక స్టేట్ డిన్నర్‌ను ఏర్పాటు చేస్తారని, తద్వారా భారత్‌, అమెరికాల మధ్య సంబంధాలు మరింత బలపడతాయని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాగా ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ఇరువురు దేశాధినేతల మధ్య పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. కాగా ప్రధాని మోదీ గతంలో 2021లో వైట్‌హౌస్‌ను సందర్శించారు. ఆ సమయంలో కొత్తగా అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన బిడెన్‌ను కలుసుకున్నారు.

ఇక ప్రధాని మోదీ పర్యటనపై కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఒక ప్రకటనలో ఇలా పేర్కొన్నాయి.. ‘ఈ పర్యటన భారతదేశం మరియు యునైటెడ్ స్టేట్స్ మధ్య అనేక రంగాలలో పరస్పరం సహకరించుకుంటున్నందున ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం యొక్క పెరుగుతున్న ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. సాంకేతికత, వాణిజ్యం, సహా పరస్పర ఆసక్తి ఉన్న వివిధ రంగాలలో బలమైన ద్వైపాక్షిక సహకారాన్ని సమీక్షించే అవకాశం నాయకులకు ఉంటుంది. ప్రధానంగా ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో చైనాను అడ్డుకునేందుకు బైడెన్‌ ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ, అమలు చేస్తున్న విధివిధానాలకు మద్దతుగా ప్రధాని మోడీ పర్యటన సాగుతుంది. ప్రపంచ ఆర్ధిక, రాజకీయ అంశాలలో చైనా యొక్క ఆధిపత్య ధోరణికి అడ్డుకట్ట వేసే దిశగా భారత్, అమెరికాలు వ్యూహాలు రచించే దిశగా ప్రయత్నాలు సాగుతాయి. అలాగే రెండు దేశాల ప్రజల మధ్య సంబంధాలను మరింతగా పెంచుతుంది’ అని వెల్లడించాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − ten =