ఆర్‌బీఐ పోర్టల్‌ ద్వారా క్లెయిమ్‌ చేయని ఎఫ్‌డీల సింపుల్‌ ట్రాకింగ్‌..

RBI Launches UDGAM Portal For Track Your Unclaimed FDs and Bank Deposits,RBI Launches UDGAM Portal,UDGAM Portal For Track Your Unclaimed FDs,Unclaimed FDs and Bank Deposits,UDGAM Portal,Mango News,Mango News Telugu,Investing, Fixed deposits, Banks, unclaimed deposits, The heirs, Nominees, Many banks,Simple tracking, Unclaimed FDs, RBI portal,RBI UDGAM Portal News Today,UDGAM Portal Latest News,UDGAM Portal Latest Updates,UDGAM Portal Live News

మనం సంపాదించిన సొమ్ము రిస్క్ లేకుండా, నమ్మకంగా మన డబ్బును అందిస్తాయనే చాలామంది ఫిక్స్‌డ్‌ డిపాజిట్స్‌లో పెట్టుబడి పెడుతూ ఉంటాము. ఇవి సమయానికి విత్‌డ్రా చేయకపోతే అన్‌క్లెయిమ్‌డ్‌ డిపాజిట్ల కింద బ్యాంకులు వద్దే ఉండిపోతాయి. ఇలాంటి డిపాజిట్లను తిరిగి క్లెయిమ్‌ చేసుకోవాలంటే ఓ ప్రాసెస్‌ను ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ డిపాజిట్‌ చేసిన వారు చనిపోతే ఆ డిపాజిట్ల గురించి వారసులకు తెలియనప్పుడు మాత్రమే ఎక్కువ శాతం డిపాజిట్లు అన్‌క్లెయిమ్‌డ్‌ డిపాజిట్లుగా ఉండిపోతాయి. వీటి గురించి వారసులు, నామినీలు తెలుసుకోవాలన్నా కూడా ఇప్పుడున్న బోలెడు బ్యాంకుల్లో.. ఏ బ్యాంకులో డిపాజిట్‌ చేశారో తెలియదు.

అందుకే ఇలాంటి సమస్యను పరిష్కరించడానికి.. అన్‌క్లెయిమ్‌డ్‌ డిపాజిట్లను లబ్ధిదారులకు అందించడానికి ఆర్‌బీఐ తాజాగా చర్యలు తీసుకుంది. యూడీజీఏఎం అనే ప్రత్యేక పోర్టల్‌ ద్వారా అన్‌క్లెయిమ్‌డ్‌ డిపాజిట్ల వివరాలను అందరికీ తెలియజేయనుంది. ఈ పోర్టల్‌ ద్వారా ఎఫ్డీ చేసి అన్ క్లెయిమ్‌డ్‌గా ఉండిపోయిన వివరాలను అందుబాటులో ఉంచింది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ గురువారం నుంచి సెంట్రలైజ్‌డ్ వెబ్ పోర్టల్ యూడీజీఏఎం అంటే క్లెయిమ్ చేయని డిపాజిట్లు సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి గేట్‌వేను ప్రారంభించింది. పబ్లిక్ ఈ పోర్టల్‌ని ఉపయోగించుకోవడానికి, చాలా బ్యాంకుల్లో తమ క్లెయిమ్ చేయని డిపాజిట్‌లు ఎన్ని ఉన్నా వాటిని ఒకే చోట ఈజీగా వెతకడం కోసం ఆర్‌బీఐ ద్వారా ఈ పోర్టల్‌ను అభివృద్ధి చేశారు.

ఏప్రిల్ 06, 2023 వరకూ ఉన్న డెవలప్‌మెంటల్ అండ్ రెగ్యులేటరీ పాలసీలపై స్టేట్‌మెంట్‌లో భాగంగా.. క్లెయిమ్ చేయని డిపాజిట్‌లను వెతకడానికి కేంద్రీకృత వెబ్ పోర్టల్‌ను డెవలప్ చేస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. రిజర్వ్ బ్యాంక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇండియన్ ఫైనాన్షియల్ టెక్నాలజీ అండ్‌ అలైడ్ సర్వీసెస్, భాగస్వామ్య బ్యాంకులు పోర్టల్‌ను అభివృద్ధి చేయడంలో సహకరించాయి. క్లెయిమ్ చేయని డిపాజిట్ల మొత్తాల సంఖ్య పెరుగుతూ ఉండటంతో ఈ విషయంపై అందరికీ అవగాహన కల్పించడానికి ఆర్‌బీఐ ఎప్పటికప్పుడు అవేర్నెస్ కార్యక్రమాలను చేపడుతుంది. ఈ కార్యక్రమాల ద్వారా క్లెయిమ్ చేయని డిపాజిట్లను.. క్లెయిమ్ చేయడానికి కొన్ని కొన్ని బ్యాంకుల పేర్లు ఇచ్చి ఆ బ్యాంకులను సంప్రదించమని ఆర్‌బీఐ చెబుతోంది.

తాజాగా యూడీజీఏఎం పోర్టల్‌ ద్వారా డిపాజిట్ మొత్తాన్ని.. క్లెయిమ్ చేసుకోవడానికి లేదా వారి డిపాజిట్ అకౌంట్లను వారి సంబంధిత బ్యాంకుల్లో ఆపరేటివ్‌ చేయడానికి కూడా వీలు కల్పిస్తుంది. వినియోగదారులు ప్రస్తుతం ఈ పోర్టల్‌లో ప్రస్తుతం ఏడు బ్యాంకులకు సంబంధించి వారి అన్‌క్లెయిమ్ చేయని డిపాజిట్ల వివరాలను తెలుసుకుని యాక్సెస్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ,పంజాబ్ నేషనల్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ధనలక్ష్మి బ్యాంక్ లిమిటెడ్, సౌత్ ఇండియన్ బ్యాంక్ లిమిటెడ్, డీబీఎస్‌ బ్యాంక్ ఇండియా లిమిటెడ్, సిటీ బ్యాంక్‌లలో ఈ సదుపాయాన్ని అందుబాటులో ఉంచింది. పోర్టల్‌లో మిగిలిన బ్యాంకుల కోసం సెర్చింగ్ పెషిలిటీ ఆప్షన్‌ను అక్టోబర్ 15, 2023 నాటికి దశలవారీగా అందుబాటులోకి వస్తుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + fifteen =