చరిత్ర సృష్టించిన రిషి సునాక్‌.. బ్రిటన్‌కు ప్రధానిగా ఎన్నికైన తొలి భారతీయ సంతతి నేత

Rishi Sunak Creates History as Becomes First Indian-Origin Prime Minister For UK, Rishi Sunak Creates History, First Indian-Origin Prime Minister Rishi Sunak, UK Prime Minister Rishi Sunak, Mango News,Mango News Telugu, Rishi Sunak Latest News And Updates, Rishi Sunak UK PM, UK PM Rishi Sunak, Indian Origin UK PM Rishi Sunak, Rishi Sunak New Prime Minister, Member of Parliament of the United Kingdom, Rishi Sunak Bristish Politician, New UK PM Rishi Sunak, UK Political Crisis LIVE Updates

యునైటెడ్ కింగ్‌డమ్ (బ్రిటన్‌) ప్రధానమంత్రిగా రిషి సునాక్‌ ఎన్నికయ్యారు. అక్టోబరు 20న ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసిన లిజ్ ట్రస్ స్థానంలో సునాక్‌ కన్జర్వేటివ్ పార్టీ నాయకుడిగా మరియు బ్రిటన్ తదుపరి ప్రధానమంత్రిగా నియమితులయ్యారు. తద్వారా బ్రిటన్‌కు ప్రధానమంత్రిగా ఎన్నికైన తొలి భారతీయ సంతతికి చెందిన నేతగా రిషి సునాక్ చరిత్ర సృష్టించారు. అలాగే బ్రిటన్‌ ప్రధానిగా ఎన్నికైన అత్యంత పిన్న వయస్కుడిగా రిషి సునాక్‌ రికార్డ్ సృష్టించారు. వెస్ట్‌మిన్‌స్టర్‌లోని అత్యంత సంపన్న రాజకీయ నాయకులలో ఒకరిగా పేరుగాంచిన 42 ఏళ్ల సునాక్‌ బ్రిటిష్ చరిత్రలోనే అత్యంత అస్థిరమైన రాజకీయ పరిస్థితుల మధ్య బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు దాదాపు 193 మంది ఎంపీలు మద్దతు తెలిపారు. 2014లో తొలిసారి రిచ్‌మండ్‌ నుంచి బ్రిటన్‌ పార్లమెంట్‌కు ఎన్నికైన సునాక్, అనంతరం 2017, 2019 ఎన్నికల్లోనూ ఇక్కడి నుంచి పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహించారు. కాగా ఆయనకు ఇంతకుముందు బ్రిటన్‌ సహాయ మంత్రిగా, క్యాబినెట్‌ మంత్రిగా, చాన్స్‌లర్‌గా పని చేసిన అనుభవం ఉంది.

బ్రిటన్‌కు ప్రధానమంత్రిగా ఒక భారత సంతతి నేత ఎన్నికవడం ఇదే తొలిసారి కావడంతో ఇటు భారతదేశంలో కూడా సంబరాలు అంబరాన్నంటాయి. ఒకప్పుడు బ్రిటన్‌ పాలనలో ఉన్న భారత్‌కు చెందిన వ్యక్తి ఇప్పుడు ఆ దేశానికి ప్రధాని కావడం విశేషం. ఇక 1980 మే 12న బ్రిటన్‌లోని సౌథాంప్టన్‌లో జన్మించిన రిషి సునాక్‌.. స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీనుంచి ఎంబీఏ, ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో ఫిలాసఫీ, పాలిటిక్స్‌, ఎకానమీ కోర్సుల్లో పట్టాలు అందుకున్నారు. కాగా భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ సహా వ్యవస్థాపకుడు నారాయణమూర్తికి సునాక్ అల్లుడు అన్న సంగతి తెలిసిందే. నారాయణమూర్తి కూతురు అక్షత మూర్తిని రిషి సునాక్‌ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా సునాక్ ఈ నెల 28న బ్రిటన్‌ ప్రధానిగా ప్రమాణం చేయనున్నారు. ఈ నేపథ్యంలో సునాక్ ఈరోజు కింగ్ ఛార్లెస్ తో సమావేశమవనున్నారు.

ఈ సందర్భంగా రిషి సునాక్ దేశప్రజలను ఉద్దేశించి తన తొలి ప్రసంగం చేశారు. ‘మనకు ఇప్పుడు స్థిరత్వం మరియు ఐక్యత అవసరం. పార్టీని మరియు మన దేశాన్ని ఏకతాటిపైకి తీసుకురావడానికి నేను అత్యంత ప్రాధాన్యతనిస్తాను. ఎందుకంటే మనం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించి, మన పిల్లలకు మరియు తర్వాతి తరాల వారికి మెరుగైన, మరింత సంపన్నమైన భవిష్యత్తును నిర్మించగల ఏకైక మార్గం అది. నేను మీకు చిత్తశుద్ధితో మరియు వినయంతో సేవ చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. అలాగే బ్రిటీష్ ప్రజలకు సుస్థిరమైన ప్రభుత్వం అందించడానికి నేను నిర్విరామంగా పని చేస్తాను’ అని ఆయన ప్రధానిగా ఎన్నికైన అనంతరం పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 5 =