పార్లమెంట్‌ రెండో విడత బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం, ధరల పెరుగుదలపై విపక్షాల నిరసన

Congress to corner government on fuel price hike, Mango News, Parliament Budget Session, Parliament Budget Session 2021, Second part of Budget Session of Parliament, Second Part Of Parliament Budget Session, Second Part Of Parliament Budget Session To Begin, Second Phase of Parliament Budget Session, Second Phase of Parliament Budget Session Commenced, Second Phase of Parliament Budget Session Commenced from Today

పార్లమెంట్‌ రెండో విడత బడ్జెట్‌ సమావేశాలు మార్చ్ 8, సోమవారం నాడు ప్రారంభమయ్యాయి. ముందుగా ఉదయం 9 గంటలకు రాజ్యసభ ప్రారంభమవగా, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు లోక్‌సభ సమావేశం కానుంది. ఈ రోజు రాజ్యసభ లో ముందుగా ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్‌ ఎంపీ మల్లికార్జున్‌ ఖర్గే బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ప్రశ్నోత్తరాల కార్యక్రమం ప్రారంభం కాగా, పెట్రోల్, డీజిల్ ధరలు, ఎల్పీజీ ధరలు పెరుగుదలకు నిరసనగా విపక్షాల సభ్యులు సభలో నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొనడంతో రాజసభ చైర్మన్ వెంకయ్య నాయుడు సభను 11 గంటల వరకు వాయిదా వేశారు.

సభ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా సభ్యుల నినాదాలు కొనసాగించడంతో మళ్ళీ 1 గంట వరకు సభను వాయిదా వేశారు. మరోవైపు త్వరలో 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను వాయిదా వేయాలని లోక్‌సభ స్పీకర్ మరియు రాజ్యసభ ఛైర్మన్ కు టీఎంసీ పార్టీ ప్లోర్ లీడర్లు లేఖ అందించారు. ముందుగా ఈ ఏడాది పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు తొలివిడతలో జనవరి 29న ప్రారంభమై, ఫిబ్రవరి 13 వరకు కొనసాగాయి. నేడు ప్రారంభమైన రెండో విడత సమావేశాలు ఏప్రిల్‌ 8 వరకు జరగనున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − 1 =