తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ను సందర్శించిన పీజీ సోషల్ వర్క్ తమిళనాడు విద్యార్థులు.

Students of Tamil Nadu PG Department of Social Work Visited Telangana State Women's Commission Office Today, Telangana State Commission for Women, Telangana State Women Commission, Tamil Nadu PG Department of Social Work, Mango News, Mango News Telugu, Students of Tamil Nadu PG Department, PG Department of Social Work, State Commission for Women Chairperson , UGC Tamil Nadu, Telangana State Womens Commission, State Women's Commission Chairperson, State Commission For Women

తెలంగాణ మహిళా కమిషన్ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శం అని తమిళనాడు విద్యార్థులు కొనియాడారు. మహిళా రంగాన్ని భవిష్యత్ లో ముందంజలో నిలిపేందుకు పథకాలు దోహద పడతాయని అభినందించారు. తమిళనాడు పీజీ సోషల్ వర్క్ విభాగంలో చదువుతున్న విద్యార్థులు తమ చదువులో భాగంగా హైదరాబాద్ లోని తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చేస్తున్న కార్యక్రమాల గురించి తెలుసుకోవడానికి హైదరాబాద్ కార్యాలయాన్ని మంగళవారం సందర్శించారు. తమిళనాడు విద్యార్థినులు తమ తమ సందేహాలను అడిగి తెలుసుకున్నారు. ఈ పథకాలను దేశవ్యాపితంగా అమలు చేస్తే మహిళలకు మంచి భవిష్యత్ ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా రాష్ట్ర మహిళా కమిషన్ సెక్రెటరీ కృష్ణ కుమారి రాష్ట్రంలో మహిళల సంక్షేమం కోసం కమిషన్ నిర్వహిస్తున్న కార్యక్రమాలపై అవగాహన కల్పించడంతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన పథకాలు సైతం వివరించారు. కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ ద్వారా ఆడపిల్లల వివాహాలకు ఆర్ధిక మనోబలం కల్పిస్తుందని, ఆరోగ్య లక్ష్మి, కేసీఆర్ కిట్స్ ద్వారా మాతా శిశువులకు ఆరోగ్య, వైద్య సదుపాయాలు కల్పిస్తున్నారని, మహిళలు అన్నింటిలో ఎదగాలని, మహిళల ఆలోచనలకు అనుగుణంగా అన్ని విధాలుగా సహాయం అందిస్తున్నారని సెక్రెటరీ కృష్ణ కుమారి అన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖతో కలిసి ‘Wednesday walk’ పేరుతో ప్రతి బుధవారం గ్రామాల్లో లింగ వివక్ష మరియు బాల్య వివాహాల నిరోధంపై అవగాహనా సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. కమిషన్ మహిళలకు రక్షణ హక్కులపై అవగాహన కల్పించడంతో పాటు మహిళలకు అండగా నిలుస్తుందన్నారు.

అనంతరం తమిళనాడు కాలేజీ ప్రొఫెసర్ డాన్మిక్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం ప్రవేశపెట్టిన పథకాలు అద్భుతం అని ప్రశంసించారు. మహిళలకు చేరువుగా ఉండేందుకు తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాకిటి సునిత లక్ష్మారెడ్డి వాట్సాప్ హెల్ప్ లైన్ 9490555533 అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని, మహిళల రక్షణ, గౌరవం, సాధికారతపై చైర్ పర్సన్ చేస్తున్న కృషి గొప్పగా ఉందని అన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − one =