దేశంలో ఉద్యోగాల కల్పనకు రూ 22810 కోట్లతో భారత్‌ రోజ్‌గార్‌ యోజన పథకం

Union Cabinet Approves Atmanirbhar Bharat Rojgar Yojana Scheme With Rs 22810 Crores,Union Cabinet,Atmanirbhar Bharat Rojgar Yojana Scheme,Union Cabinet Approves Atmanirbhar Bharat Rojgar Yojana Scheme,Union Cabinet Latest News,Union Cabinet Updates,Union Cabinet News,Cabinet Approves Rs 22810 Crore Atmanirbhar Bharat Rojgar Yojana,Cabinet Approves Atmanirbhar Bharat Rozgar Yojana,Cabinet Approves Rs 22810 Crore Outlay For Atmanirbhar Bharat Rozgar Yojana,Cabinet Approves Atmanirbhar Bharat Rojgar Yojana Scheme,Cabinet Meeting

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆత్మనిర్భర్‌ భారత్‌ అభియాన్ 3.0 కింద రూ.2,65,080 కోట్లతో 12 కీలక రంగాలకు ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఉద్యోగ అవకాశాలను కల్పనకు ఆత్మ నిర్భర్‌ భారత్‌ రోజ్‌గార్‌ యోజన పేరుతో కంపెనీలకు ప్రోత్సాహకాలు అందించనున్నట్టు తెలిపారు. కాగా బుధవారం నాడు భారత్‌ రోజ్‌గార్‌ యోజన పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం అమలు కోసం 2020-2023 కాలానికి మొత్తం రూ.22,810 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. ఈ పథకానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.1,584 కోట్లు కేటాయించారు. కేబినెట్ నిర్ణయాలను కేంద్రమంత్రులు రవిశంకర్‌ ప్రసాద్‌, సంతోష్‌ గంగ్వార్‌ మీడియాకు వెల్లడించారు.

ఈ పథకం కింద అక్టోబ‌ర్ 1, 2020 నుంచి జూన్ 30, 2021 వ‌ర‌కు కొత్త ఉద్యోగుల‌ను నియ‌మించే సంస్థల‌కు రెండేళ్ల వ‌ర‌కు కేంద్ర ప్ర‌భుత్వం సబ్సిడీ అందించనుంది. రెండు సంవత్సరాల పాటుగా 1000 మంది ఉద్యోగులు ఉన్న సంస్థలలో కొత్త ఉద్యోగులకు సంబంధించి 12% ఉద్యోగుల మరియు 12% కంపెనీ ఈపీఎఫ్ వాటాను కేంద్రప్రభుత్వమే చెల్లించనుంది. అలాగే 1000 మంది క‌న్నా ఎక్కువ ఉద్యోగులు ఉన్న కంపెనీలలో కేవ‌లం ఉద్యోగుల 12 శాతం ఈపీఎఫ్ వాటాను మాత్ర‌మే కేంద్ర ప్రభుత్వం రెండేళ్ల పాటు చెల్లించనుంది. నెలవారీ వేతనం రూ. 15000 పొందుతూ అక్టోబర్ 1 కి ముందు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ) లో రిజిస్టర్ కానివారు మరియు అక్టోబర్ 1, 2020 కి ముందు యూనివర్సల్ అకౌంట్ నంబర్ లేదా ఇపిఎఫ్ మెంబర్ అకౌంట్ నంబర్ లేనివారికీ కూడా ఈ పథకం వర్తిస్తుందని చెప్పారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × two =