అన్‌లాక్‌ 5.0: దేశంలో స్కూళ్లు ప్రారంభం ఎప్పుడంటే?

Unlock 5.0: States to Decide On Reopening of Schools After October 15

కేంద్రప్రభుత్వం ఈ రోజు అన్‌లాక్‌ 5.0 మార్గదర్శకాలను విడుదల చేసింది. అక్టోబర్ 1 నుంచి ఈ మార్గదర్శకాలు అమల్లోకి రానున్నాయి. కంటైన్మెంట్ జోన్స్ కానీ ప్రాంతాల్లో మరికొన్ని కార్యకలాపాలను తిరిగి ప్రారంభించేందుకు కేంద్రం అనుమతి నిచ్చింది. ముఖ్యంగా పాఠశాలలు మరియు కోచింగ్ సంస్థలను తిరిగి ప్రారంభించడానికి రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకే నిర్ణయం తీసుకునే వెసులుబాటును కేంద్రం కల్పించింది. తల్లిదండ్రుల అనుమతితో అక్టోబర్ 15 తర్వాత పాఠశాలల ప్రారంభంపై రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవచ్చని ప్రకటించారు.

పాఠశాలలు తెరవడంపై మార్గదర్శకాలు:

  • ఆన్‌లైన్/దూరవిద్య కొనసాగుతుంది మరియు ప్రోత్సహించబడుతుంది.
  • పాఠశాలలు ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తున్న చోట, కొంతమంది విద్యార్థులు బౌతికంగా పాఠశాలకు హాజరుకాకుండా ఆన్‌లైన్ తరగతులకు హాజరు కావడానికే ఇష్టపడితే, వారిని అలాగే అనుమతించవచ్చు.
  • తల్లిదండ్రుల వ్రాతపూర్వక అనుమతితో మాత్రమే పాఠశాలలు/విద్యాసంస్థలకు విద్యార్థులు హాజరుకావాలి.
  • అటెండెన్స్ అమలు చేయకూడదు మరియు పూర్తిగా తల్లిదండ్రుల సమ్మతిపై ఆధారపడి ఉండాలి.
  • కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా, స్థానిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు స్కూల్స్ తెరవడంపై తమ స్వంత స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపి) ను సిద్ధం చేసుకోవచ్చు.
  • తెరవడానికి అనుమతించిన పాఠశాలలు అన్ని ఆయా రాష్ట్రాలు జారీ చేయవలసిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలి.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − twelve =