మీకు తెలుసా ఇండియన్స్ కనిపించని దేశాలు ఎక్కడెక్కడ ఉన్నాయో?

couWhere Are the Countries Where Indians Are Not Found,Indians Are Not Found Countries,Where Are the Countries,Countries Where Indians Are Not Found,Mango News,Mango News Telugu,Is There Any Country with No Indian,Bulgaria, Countries, Indians, Vatican City to Bulgaria,Indians Are Not Found, Pakistan, San Marino, Tuvalu Country, Vatican City,Population of Overseas Indians,Indians Are Not Found Newsntries
countries

ప్రపంచం మొత్తం మీద ఎక్కడ చూసినా భారతీయులు కనిపిస్తూనే ఉంటారు. అందుకే ఇండియా నుంచి వెళ్లేవాళ్లంతా అక్కడ స్థిరపడిన వారినే తమ కుటుంబసభ్యులుగా భావిస్తూ.. పండుగలకు, ఫంక్షన్లకు తమ వాళ్లను మిస్ అయ్యామన్న ఫీలింగ్‌ నుంచి బయటపడుతూ ఉంటారు. అయితే కొన్ని దేశాలలో మాత్రం ఎందుకో భారతీయులు వెళ్లడానికి, అక్కడ స్థిరపడటానికి అస్సలు ఇష్టపడటం లేదట.

ముఖ్యంగా మన పొరుగుదేశం అయిన పాకిస్తాన్‌కు అయితే అసలే వెళ్లడానికి వెనుకడుగు వేస్తున్నారట. అలా పాకిస్తాన్‌తో పాటు యూరప్ వంటి కంట్రీలకు కూడా భారతీయులు నో చెప్పేస్తున్నారట.ఒక్క పాకిస్తాన్, యూరప్‌నే కాదు ఇంకా చాలా దేశాల ముఖం చూడటానికి కూడా ఇండియన్స్ ఆలోచిస్తున్నారట.

వేలాది మందిభారతీయులు అనేకంటే లక్షలాదిమంది భారతీయులు ..అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాల్లో భారతీయులు స్థిరపడ్డారు. ప్రపంచంలోని దాదాపు 195 దేశాల్లో ఇండియన్స్ వివిధ జాబులు చేస్తూ ఉండటమే కాకుండా అక్కడే స్థిరపడిపోతున్నారు. అయితే కొన్ని దేశాల్లో మాత్రం భూతద్దం పెట్టి వెతికినా కూడా ఒక్క భారతీయుడు కూడా కనిపించడంటే మాత్రం కాస్త ఆశ్చర్యపోక తప్పదు.

భారతీయులు కనిపించని దేశాలు..

యూరోపియన్ దేశమైన వాటికన్ సిటీ ప్రపంచంలో అతి చిన్న దేశంగా పేరు గాంచింది. కేవలం 0.44 చదరపు కి.మీటర్ల విస్తీర్ణంలో వాటికన్ సిటీ ఉంది. ఆ దేశంలో నివసించేవారు రోమన్ క్యాథలిక్ మతాన్ని ఫాలో అవుతారు. వాటికన్ సిటీలో జనాభా కూడా చాలా అంటే చాలా తక్కువ. ఎందుకో కానీ ఈ దేశంలో ఒక్క భారతీయుడు కూడా నివసించడం లేదు. క్రైస్తవులు ఎక్కువగా ఉండటమే దీనికి కారణంగా కొంతమంది చెబుతున్నా దీని గురించి నిజానిజాలు మాత్రం పూర్తిగా తెలియదు. అయితే దీనికి పూర్తి భిన్నంగా రోమన్ క్యాథలిక్ మతాన్ని అనుసరించే క్రైస్తవులు మాత్రం భారతదేశంలో పెద్ద సంఖ్యలోనే ఉన్నారు.

ఐరోపాలోని ఒక రిపబ్లిక్ దేశమైన శాన్ మారినో కూడా ఇంతే . శాన్ మారినోలో మొత్తం జనాభా 3 లక్షల 35 వేల 620 మంది ఉండగా.. ఈ దేశ జనాభాలో ఒక్కడంటే ఒక్కడూ కూడా భారతీయుడు కనిపించడు. కాకపోతే సెటిల్ అవడానికి, ఉద్యోగరీత్యా వెళ్లడానికి ఇష్టపడని భారతీయులు.. ఈ దేశంలో టూరిస్టులుగా కనిపిస్తూ ఉంటారు. ఆగ్నేయ ఐరోపాలోని ఒక దేశమైన బల్గేరియాలోనూ భారతీయులు కనిపించరు. బల్గేరియా ప్రకృతి అందాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన దేశంగా చెబుతారు. 2019 జనాభా లెక్కల ప్రకారం బల్గేరియా దేశంలో.. మొత్తం జనాభా 6,951,482 మంది ఉండగా భారతీయుడు ఒక్కడూ ఉండడు. ఇక్కడ నివసించేవారిలో ఎక్కువ శాతం మంది క్రైస్తవ మతాన్నే అనుసరిస్తారు. బల్గేరియా దేశంలో భారతీయులు ఎవరూ నివసించరు కానీ ఇక్కడ భారతీయ దౌత్యవేత్తలు మాత్రం కనిపిస్తారు.

ఓషియానియా ఖండంలోని ఒక ద్వీపంలో ఉన్న దేశం..తువాలు. తువాలు దేశాన్ని ఎల్లిస్ దీవులు అని కూడా పిలుస్తుంటారు. ఇది ఓషియానియాలో ఉంది. ఇంకా చెప్పాలంటే ఆస్ట్రేలియాకు ఈశాన్య పసిఫిక్ మహాసముద్రంలో తువాలు దేశం ఉంది. ఈ దేశ జనాభా కేవలం 10 వేలు మంది మాత్రమే. ఈ ద్వీపంలో కేవలం 8 కి.మీటర్ల పొడవైన రోడ్లు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ కూడా భారతీయులెవరూ నివసించరు. తువాలు దేశానికి 1978లో స్వాతంత్ర్యం వచ్చింది.

అంతేకాదు భారతీయులు నివసించని దేశాల జాబితాలో లాస్ట్ బట్ నాట్ లీస్టు అన్నట్లుగా మన పొరుగు దేశం పాకిస్తాన్ గురించి చెప్పుకోవాలి. భారతదేశం, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల వల్ల భారతీయులెవరూ కూడా పాకిస్తాన్‌కు వెళ్లడానికే ఇష్టపడరు. ఇక సెటిలయ్యే సీన్ ఎక్కడా కనిపించదు. పాకిస్తాన్‌లో భారత దౌత్యవేత్తలు, ఖైదీలు తప్ప భారత దేశానికి చెందినవారెవరూ కూడా కనిపించరు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + seventeen =