608 నామినేషన్లు రిజెక్ట్..విత్​ డ్రాకు ఒక్కరోజు అవకాశం ​

608 nominations rejected with one day chance for draw,608 nominations rejected,rejected with one day chance,one day chance for draw,Mango News,Mango News Telugu,Telangana,Janareddy,Senior leader Jana Reddy, CM ,608 nominations rejected,TRS, Congress, Bjp, Assemblly Elections,608 nominations Latest News,608 nominations rejected Latest Update,Assemblly Elections Latest News,Assemblly Elections Latest Updates,Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates
Telangana,Janareddy,Senior leader Jana Reddy, CM ,608 nominations rejected,TRS, Congress, Bjp, Assemblly Elections

తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల నామినేషన్ల స్క్రూటినీ  ప్రక్రియ సోమవారంతో పూర్తైంది. ఈసారి జరగనున్న  అసెంబ్లీ ఎన్నికల కోసం 119 నియోజకవర్గాల్లో  అభ్యర్ధులు రికార్డు స్థాయిలో నామినేషన్‌లు దాఖలు చేశారు. అయితే వాటిలో  కొన్ని నామినేషన్లు  ఎన్నికల కమిషన్‌ సూచించిన విధంగా లేవని అధికారులు తిరస్కరించారు .

అన్ని నియోజక వర్గాల్లో ఊహించని విధంగా  4,798 మంది నామినేషన్లు దాఖలు చేయగా.. ఏకంగా  608 నామినేషన్లు రిజెక్ట్​ అయ్యాయి. ఈ నెల 15 వరకు నామినేషన్లు విత్​ డ్రా చేసుకునే అవకాశం ఉంది. దీంతో మంగళవారం సాయంత్రానికి ఎన్నికల బరిలో నిలబడే అభ్యర్థుల సంఖ్యపై క్లారిటీ రానుంది. తిరస్కరణకు గురైన నామినేషన్లలో బీఎస్పీ అభ్యర్థులు 8 మంది ఉన్నారు.

తిరస్కరించిన నామినేషన్లలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి జానారెడ్డి నామినేషన్‌ ఉండటం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.  తాను టీ కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా చెప్పుకుంటూ  తిరుగుతున్న జానారెడ్డి  నామినేషన్ రిజక్ట్ అవడంపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.ఇక ఆయన సీఎం ఆశలు  గల్లంతేనా అని కౌంటర్లు వేస్తున్నారు.

నాగార్జునసాగర్‌లో జానారెడ్డి కొడుకు జైవీర్‌రెడ్డి పోటీలో ఉండగా.. అదే  నాగార్జున  సాగర్ నుంచి  జానారెడ్డి నామమాత్రంగా నామినేషన్ వేశారు.  సీనియర్‌ నేతగా, ఎన్నోసార్లు  శాసనసభ్యుడిగా గెలిచిన జానారెడ్డి కొడుకుతో పాటు నామమాత్రంగా నామినేషన్ వేసినా కూడా.. దానిని ఇప్పుడు తిరస్కరించడంపై  భిన్నవాదనలు  వినిపిస్తున్నాయి.

రాజన్న సిరిసిల్ల జిల్లాలోనూ  మరో రెండు నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. అలాగే కరీంనగర్ మానకొండూరులో7 నామినేషన్లు, నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి 3 నామినేషన్లు తిరస్కరించారు. కొల్లాపూర్ నుంచి ఏకంగా  21 మంది నామినేషన్లు దాఖలు చేయగా వారిలో సరైన పత్రాలు సమర్పించలేదనే కారణంతో  మూడింటిని తిరస్కరించారు.

స్టేషన్ ఘన్ పూర్(ఎస్సీ)లో నామినేషన్ వేసిన తాళ్లపల్లి వెంకటస్వామి, పాలకుర్తి నుంచి సింగారం రవీంద్రగుప్త, భువనగిరిలో ఉప్పల జహంగీర్, మిర్యాలగూడలో జాడి రాజు, ఆలేరులో గందమల్ల లింగస్వామి, మధిర(ఎస్సీ) నుంచి చెరుకుపల్లి శారద, బహదూర్​పురలో కే.ప్రసన్న కుమారి యాదవ్, గోషామహల్‌లో మహ్మద్ కైరుద్దీన్ అహ్మద్ లు ఉన్నారు. బీఎస్పీ 119 అసెంబ్లీ స్థానాలకు గాను 111 స్థానాల్లోనే తలపడనుంది. అయితే సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్‌లో 145 మంది 154 సెట్ల నామినేషన్లు దాఖలు చేయగా..వాటిలో 13 నామినేషన్లు రిజెక్ట్​ చేశారు అధికారులు.

సిరిసిల్లలో అన్ని నామినేషన్లు ఆమోదం పొందగా.. వేములవాడలో 2 నామినేషన్లు, మానకొండూరులో 7  నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నుంచి 21 మంది  నామినేషన్లు వేయగా.. సరైన పత్రాలులేవని ముగ్గురి నామినేషన్లు రిజెక్ట్  చేశారు. మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో 7 నామినేషన్లు, పాలేరులో 5, సూర్యాపేటలో 10,  మంథనిలో 4, కరీంనగర్​లో 7, ఖానాపూర్ లో 4 నామినేషన్లు తిరస్కరించబడ్డాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + four =