రేపే ఖమ్మంలో బీఆర్ఎస్ తొలి బహిరంగ సభ.. భారీ ఏర్పాట్లు చేసిన నేతలు, గులాబీమయమైన పట్టణం

All Arrangements Set up For BRS First Public Meeting in Khammam Tomorrow Three Chief Ministers will Attend Along with CM KCR,BRS Public Meeting which to held on January 18th,CM KCR Discusses,Khammam District Leaders,BRS Public Meeting,held on January 18th,Mango news,Mango News Telugu,BRS Party Public Meeting,BRS Party Khammam Public Meeting,CM Kejriwal,CM Vijayan,CM Bhagwantman,CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates

రేపు ఖమ్మంలో జరిగే బీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాగా టీఆర్ఎస్ బీఆర్‌ఎస్ పార్టీగా రూపాంతరం చెందాక నిర్వహిస్తున్న తొలి బహిరంగ సభ కావడంతో దీనిని విజయవంతం చేసేందుకు పార్టీ శతధా ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగా సభ కోసం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ సభ ద్వారా బీఆర్‌ఎస్ పార్టీ ఏర్పాటుకు దారితీసిన పరిస్థితులను, సాధించాల్సిన లక్ష్యాలను యావత్ దేశం దృష్టికి తీసుకెళ్లాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే ఆయన బీజేపీయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఈ సభకు ఆహ్వానిస్తున్నారు. వీరిలో ప్రధానంగా ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌, కేరళ సీఎం పినరయి విజయన్‌ తదితరులు హాజరవుతున్నారు. అలాగే సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ.రాజా, ఉత్తరప్రదేశ్‌ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ సహా పలు జాతీయ పార్టీల ప్రతినిధులు కూడా పాల్గొననున్నారు.

ఈ నేపథ్యంలో ఖమ్మం పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ ఏర్పాట్లు ఇలా ఉన్నాయి..

  • 100 ఎకరాల్లో సభ, 400 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేశారు.
  • 15 వేల మంది వీఐపీలకు ప్రత్యేకంగా పార్కింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు.
  • నియోజకవర్గాల వారీగా వారికి కేటాయించిన స్థలంలో పార్కింగ్ చేసేలా డ్రైవర్లకు క్యూఆర్ కోడ్ ఇస్తున్నారు.
  • వీఐపీల కోసం సభా వేదిక ముందు 20 వేల కుర్చీలను ఏర్పాటు చేయనున్నారు.
  • దాదాపు 3 లక్షల మంది పార్టీ కార్యకర్తలు సభకు హాజరుకాబోతున్నారు.

ఖమ్మంలో బీఆర్ఎస్ బహిరంగ సభ షెడ్యూల్..

  • మంగళవారం రాత్రికి జాతీయ నేతలంతా హైదరాబాద్‌కు చేరుకుంటారు.
  • యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌కు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలుకుతారు.
  • ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కి , పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్‌కి మంత్రి మహమూద్‌ అలీ స్వాగతం చెబుతారు.
  • కేరళ సీఎం పినరయి విజయన్ కి మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి స్వాగతం పలుకుతారు.
  • సీపీఐ జాతీయనేత డి.రాజాకు – బీఆర్ఎస్ నేత దాసోజు శ్రావణ్‌ స్వాగతం స్వాగతం పలుకుతారు.
  • 18వ తేదీ ఉదయం జాతీయ నేతలంతా సీఎం కేసీఆర్‌తో బ్రేక్‌ఫాస్ట్‌ చేస్తారు. అనంతరం వారంతా దేశ రాజకీయాలపై చర్చిస్తారు.
  • ఆ తర్వాత సీఎం కేసీఆర్‌తో కలిసి అందరూ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శనం చేసుకుని రెండు హెలీకాప్టర్లలో ఖమ్మంకు బయలుదేరుతారు.
  • సీఎం కేసీఆర్‌తో కలిసి వారంతా ఖమ్మం కలెక్టరేట్‌ చేరుకొని, రాష్రంరులో చేపట్టే రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.
  • ఇక ఖమ్మంలో సభా వేదిక ముందు ప్రధాన నాయకులకు ప్రత్యేక సెక్టార్‌ ఉంటుంది.
  • మంత్రులు, బీఆర్ఎస్ నాయకులు సభావేదిక ముందు ఆసీనులవగా.. సీఎం కేసీఆర్‌తో సభా వేదికపై ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలు ఉంటారు.
  • కాగా ఈ బహిరంగ సభ మ. 2 నుంచి సా. 5 గంటల వరకు జరుగుతుంది.

ఖమ్మం ట్రాఫిక్ పోలీసుల ఆంక్షలు..

  • మీటింగ్ కోసం వచ్చే ప్రజలు పార్కింగ్ స్థలంలో వాహనాలు నిలిపి మీటింగ్ స్థలానికి చేరుకోవచ్చు.
  • భారీ వాహనాలు వెళ్లే హైవేలో.. లారీలు, హైదరాబాద్, వరంగల్ వైపు వెళ్లే డీసీఎంలు బోనకల్ చిల్లకల్లు వైపు మళ్లిస్తారు.
  • ఏనుకూరు నుంచి జన్నారం వైపు వెళ్లే భారీ వాహనాలను వైరా-బోనకల్ వైపు మళ్లిస్తారు.
  • వైరా వైపు వస్తున్న భారీ వాహనాలు చింతకిని వైపు బోనకల్ రోడ్డు వైపు వెళ్లాల్సి ఉంటుంది.
  • యెల్లందు వైపు నుంచి భారీ వాహనాలను ఎన్టీఆర్ సర్కిల్- రాపర్తినగర్ పాస్‌రోడ్డు మీదుగా హైద్, డబ్ల్యూఆర్‌ఎల్ రోడ్డు వైపు మళ్లిస్తారు.
  • అలాగే రాపర్తినగర్‌లోని వాహనాలను బైపాస్ రోడ్డు మీదుగా హైదరాబాద్ రోడ్డుకు మళ్లిస్తారు.
  • మహబూబాబాద్ వైపు నుంచి వచ్చే భారీ వాహనాలను ఏదులాపురం, రూరల్ పీఎస్ సర్కిల్ వైపు కోదాడ వైపు నుంచి విజయవాడ హైవే వైపు మళ్లిస్తున్నారు.
  • వరంగల్ వైపు నుంచి వస్తున్న భారీ వాహనాలు: రూరల్ పీఎస్ సర్కిల్ వైపు మళ్లించి కోదాడ వైపు నుంచి విజయవాడ హైవే మళ్లిస్తారు.
  • హైదరాబాద్ నుంచి సూర్యాపేట వైపు వచ్చే భారీ వాహనాలు గుర్రాలపాడు-వెంకటగిరి ఎక్స్‌రోడ్డు-కోదాడ వైపు-విజయవాడ హైవే వైపు మళ్లిస్తారు.
  • ఇక ఖమ్మం వెళ్లే వాహనాలను తిమ్మరావుపేట, ముచ్చర్ల ఎక్స్ రోడ్డు-ఎన్టీఆర్ సర్కిల్ వైపు మళ్లిస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 − 2 =