ఆ స్థానం నుంచి బండ్ల గణేష్ పోటీ

Lok sabha elections, Bandla Ganesh, Congress, Congress MP Candidate, Telangana Assembly, film producer Bandla Ganesh, Tollywood, YSRCP, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Mango News, Mango News Telugu
Lok sabha elections, Bandla Ganesh, Congress, Congress MP Candidate

కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ సినీ నిర్మాత బండ్ల గణేష్. పలు అంశాలపై కాంట్రవర్సీ కామెంట్లు చేస్తూ ఆయన నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. ఆయన దేనిపై స్పందించిన నిత్యం సోషల్ మీడియాలో వైరలవుతుంటారు. గత కొద్దిరోజులుగా బండ్ల గణేష్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలని ఆశపడుతున్నారు. పవన్ కళ్యాణ్‌కు గణేష్ వీరాభిమాని కావడంతో.. జనసేనలో చేరుతారని అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయి. కానీ ఆయన మాత్రం జనసేనలో చేరేందుకు వెనుకడుగు వేశారు. పవన్ కళ్యాణ్‌కు తాను వీరాభిమానిని చెబుతూనే.. జనసేలో చేరే ఆసక్తి లేదని గణేష్ తేల్చేశారు.

ఆ తర్వాత 2018లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. ఆ ఏడాది చివరలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున ప్రచారం కూడా చేశారు. కానీ చివరికి అప్పుడు కాంగ్రెస్ ఓడిపోయింది. దీంతో గణేష్ కొంతకాలం కాంగ్రెస్ హైకమాండ్‌కు దూరంగా ఉన్నారు. తిరిగి సినిమాలపై ఫోకస్ పెట్టారు. ఇక ఇటీవల జరిగిన ఎన్నికలకు ముందు మళ్లీ గణేష్ యాక్టీవ్ అయ్యారు. ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్ తరుపున విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ గెలుపు కోసం కష్టపడ్డారు.

ఇక తెలంగాణలో ఎట్టకేలకు కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరింది. దీంతో తనకు మంచి పదవి దక్కుతుందని బండ్ల గణేష్ ఆశించారు. అటు ఎమ్మెల్సీ పదవి లేదా కార్పోరేషన్ చైర్మన్ పదవి ఆయనకు ఇస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ చివరికి అది జరగలేదు. దీంతో లోక్ సభ ఎన్నికల బరిలోకి దిగేందుకు బండ్ల గణేష్ సిద్ధమయ్యారు. ఈ మేరకు లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ఆశావాహుల కాంగ్రెస్ దరఖాస్తులు ఆహ్వానించగా.. బండ్ల గణేష్ కూడా దరఖాస్తు చేసుకున్నారు. మల్కాజ్‌గిరి నుంచి లోక్ సభ ఎన్నికల బరిలోకి దిగేందుకు గణేష్ రెడీ అవుతున్నారు.

పోయిన సారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి కొడంగల్ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఆయన మల్కాజ్‌గిరి నుంచి బరిలోకి దిగి విజయం సాధించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి గెలుపొందడంతో రేవంత్ రెడ్డి.. తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. అటు మల్కాజ్‌గిరిలో కాంగ్రెస్ గాలి కూడా గట్టిగానే వీస్తోంది. ఈక్రమంలో ఆ స్థానం నుంచి బరిలోకి దిగితే గెలిచి తీరుతాననే నమ్మకంతో బండ్ల గణేష్ మల్కాజ్‌గిరి స్థానానికి దరఖాస్తు చేసుకున్నారట. అయితే ఆ స్థానానికి ఈసారీ గట్టి పోటీ ఉంది. పెద్ద ఎత్తున నేతలు ఆ స్థానం నుంచి బరిలోకి దిగేందుకు పోటీ పడుతున్నారు. మరి ఈ పరిణామాల మధ్య గణేష్‌కు టికెట్ దక్కుతుందా? లేదా? అన్నది చూడాలి మరి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + 4 =