కేటీఆర్ వ్యాఖ్యలు తప్పుపట్టిన బండారు దత్తాత్రేయ

Bandaru Dattatreya, Bandaru Dattatreya Condemns KTR comments, bjp, BJP Leader Bandaru Dattatreya Condemns KTR, BJP Leader Bandaru Dattatreya Condemns KTR comments, Dattatreya Condemns KTR comments, Latest Political News, Mango News Telugu, Telangana BJP, Telangana Political News, Telangana Politics, TRS Working President KTR

తెలంగాణ బీజేపీ సీనియర్ నాయకుడు బండారు దత్తాత్రేయ మంగళవారం నాడు పలు అంశాల గురించి మీడియాతో మాట్లాడారు. టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జాతీయవాదాన్ని మతవాదంతో ముడిపెడుతూ వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదని దత్తాత్రేయ అన్నారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినాన్ని తెరాస ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని దత్తాత్రేయ డిమాండ్ చేశారు. మజ్లిస్ పార్టీకి భయపడి విమోచన దినాన్ని ప్రభుత్వం జరపడం లేదని, ఆగస్టు 15న జాతీయజెండా ఎగురవేసిన విధంగానే, సెప్టెంబర్ 17న కూడ జాతీయజెండా ఎగురవేయాలని అన్నారు.

ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రంలో ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇచ్చారో చెప్పాలని తెరాస ప్రభుత్వాన్ని బండారు దత్తాత్రేయ డిమాండ్ చేసారు. ప్రాజెక్టుల నుండి వచ్చే నీటి కోసం రైతులు ఎదురుచూస్తున్నారని చెప్పారు, రూ. 80 వేల కోట్లు ఖర్చు చేసి ఒక ఎకరాకి కూడ నీరు ఇవ్వలేని పరిస్థితి ఉందని విమర్శించారు. రైతు రుణమాఫీకి సంబంధించిన నిధులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలన్నారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ కాంగ్రెస్ పార్టీ పై కూడ విమర్శలు చేసారు. జమ్మూ కశ్మీర్ కు సంబంధించిన ఆర్టికల్-370 రద్దు విషయంలో కాంగ్రెస్ పార్టీలోనే ఎటువంటి ఏకాకిప్రాయం లేదని ఎద్దేవా చేసారు, ఆర్టికల్-370 రద్దును మతంతో ముడిపెట్టడం తప్పని కాంగ్రెస్ నాయకుడు చిదంబరాన్ని తప్పు పట్టారు.

 

Subscribe to our Youtube Channel Mango News for the latest News.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here