పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు..!

BJP MLA Raghunandan Rao Gives Clarity Over The Party Change Speculations,BJP MLA Raghunandan Rao Gives Clarity,Clarity Over The Party Change Speculations,MLA Raghunandan Rao Gives Clarity,Mango News,Mango News Telugu,BJP MLA Raghunandan Rao, party change, BJP MLA, BJP, MLA, Farmers of Maharashtra, PK, Prakash Raj,BJP MLA Raghunandan Rao Latest News,BJP MLA Raghunandan Rao Latest Updates,BJP MLA Raghunandan Rao Live News

ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ వరుసగా పార్టీలో జంపింగ్‌లు జోరు అందుకోవడం కామన్‌గా కనిపిస్తుంటాయి. అప్పటిదాకా పార్టీలో ఉంటూ ప్రత్యర్థులపై విరుచుకుపడ్డ నేతలు.. సడన్‌గా సైలెంట్‌ అయిపోతుంటారు. అదును చూసుకుని వేరే పార్టీలోకి జంప్‌ అవుతుంటారు. ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఏ నేత సైలెంట్‌ అయినా సరే.. పార్టీ మారుతున్నారని ప్రచారం మోతమోగిపోతోంది. ఇలాగే బీజేపీ ఎమ్మెల్యే రఘనందన్‌ రావు కూడా చాలా రోజులుగా సైలెంట్‌గా ఉంటూ వస్తున్నారు. పార్టీ పరంగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించకపోవడంతో.. ఈయనపై కూడా గాసిప్స్‌ ఓ రేంజ్‌లో వినిపిస్తున్నాయి. పార్టీ హైకమాండ్‌కు, రఘునందన్‌ రావుకు మధ్య గ్యాప్‌ పెరిగిందని.. అందుకే టైమ్‌ చూసుకుని వేరే పార్టీలోకి వెళ్లే చాన్స్‌ ఉందని… ఆ పార్టీకూడా బీఆర్ఎస్ నే అని జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ వార్తల్ని ఖండించిన ఆయన. తాను పార్టీ మారడం లేదని క్లారిటీ ఇచ్చారు. అయితే.. వచ్చే ఎన్నికల్లోనూ దుబ్బాక నుంచే బరిలో ఉండబోతున్నట్టు చెప్పారు.

సీఎం కేసీఆర్ పదేళ్లలో గజ్వేల్‌ నియోజకవర్గంలో ఎంత అభివృద్ధి చేశారో తాను చూద్దామని వెళ్దామంటే ముందు రోజునే తనను అరెస్ట్ చేసి.. బిచ్కుంద పోలీసు స్టేషన్ తీసుకెళ్లారని రఘునందన్ రావు విమర్శించారు. అయితే.. అక్కడ ఎలాంటి కేసు నమోదు చేయలేదన్నారు. కామారెడ్డి నుంచి బస్సులు పెట్టుకుని గజ్వేల్ వస్తే కేసీఆర్‌కు భయం ఎందుకంటూ రఘునందన్ రావు ప్రశ్నించారు.

గజ్వేల్ అభివృద్ధిని చూడటానికి మహారాష్ట్ర రైతులకు, పీకేకు, ప్రకాష్ రాజ్‌కు అవకాశం ఉంటుంది కానీ.. స్వరాష్ట్రంలోనే నేతలయిన తమను మాత్రం ఎందుకు రానివ్వట్లేదని రఘనందన్ రావు నిలదీశారు. ఏదో రోజు టైం, డేట్ చెప్పకుండా గజ్వేల్‌కు వస్తామని చెప్పిన ఆయన.. గజ్వేల్ బస్‌స్టాండ్ ఎలా ఉందో.. డబుల్ బెడ్ రూం ఇళ్లు ఎలా ఉన్నాయో కచ్చితంగా చూస్తామని సవాల్ విసిరారు. అంతేకాదు అటు పోలీస్ శాఖకు కూడా వార్నింగ్ ఇచ్చారు. ఎప్పుడూ బీఆర్ఎస్ పార్టీనే అధికారంలో ఉండబోదని.. పోలీసులు కాస్త జాగ్రత్తగా ఉండాలని కూడా రఘునందర్ రావు హెచ్చరించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − three =