జూబ్లీహిల్స్‌పై కన్నేసిన అజహరుద్దీన్‌..

Former Congress MP Azharuddin Eyes on Jubilee Hills Constituency To Contest in Next Assembly Polls,Former Congress MP Azharuddin,MP Azharuddin Eyes on Jubilee Hills,Constituency To Contest in Next Assembly Polls,Contest in Next Assembly Polls,Mango News,Mango News Telugu,Azharuddin ,attempts to contest, Jubilee Hills Assembly Constituency,T. Congress,Former MLA Vishnuvardhan Reddy,Congress MP Azharuddin Latest News,Congress MP Azharuddin Latest Updates,Congress MP Azharuddin Live News

తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. కాంగ్రెస్‌కు అసంతృప్త నేతలతో కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. ఇప్పటికే ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది టీకాంగ్రెస్‌. అభ్యర్థుల లిస్ట్‌ తయారుచేసే పనిలో బిజీగా ఉంది. ఐతే.. టికెట్‌ అశించే నేతల రాజకీయంతో కాంగ్రెస్‌కు ఇప్పుడు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. తాజాగా హస్తం పార్టీలో జూబ్లీహిల్స్ అసెంబ్లీ టికెట్ రగడ చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీకి అజహరుద్దీన్ ప్రయత్నాలు ప్రారంభించారు.తాజాగా మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి వ్యతిరేక గ్రూప్‌తో ఆయన భేటీ కావడం కాంగ్రెస్‌లో చర్చకు దారితీసింది.

ఈ ఏడాది ఆగస్టు 9వ తేదీన జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలోని రహమత్‌నగర్‌లో అజహరుద్దీన్ వర్గం సమావేశం నిర్వహించింది. ఈ సమావేశం గురించి మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డికి సమాచారం ఇవ్వలేదు. అయితే ఈ విషయం తెలుసుకున్న విష్ణువర్ధన్ రెడ్డి వర్గం అజహరుద్దీన్ వర్గాన్ని నిలదీసింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఇరువర్గాలకు సర్దిచెప్పి అక్కడి నుంచి పంపించారు.

2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా జూబ్లీహిల్స్ నుంచి విష్ణువర్ధన్ రెడ్డి పోటీ చేసి విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి మాగంటి గోపినాథ్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల్లో మాగంటి గోపినాథ్ టీడీపీని వీడి బీఆర్ఎస్‌లో చేరారు. 2018 ఎన్నికల్లో మరోసారి ఇదే స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి గోపినాథ్ విజయం సాధించారు.

ఈ ఏడాది చివరలో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. దీంతో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంపై అజహరుద్దీన్ కేంద్రీకరించారు. గత ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలని అజహరుద్దీన్ ప్రయత్నించారు. కానీ ఆయనకు టిక్కెట్టు దక్కలేదు. దీంతో ఈ దఫా జూబ్లీహిల్స్ నుంచి పోటీకి అజహరుద్దీన్ ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో అజహరుద్దీన్ పర్యటించడం మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డిని అసంతృప్తికి గురి చేసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 + eight =