ప్రతీ గ్రామ పంచాయతీకి రూ.10 లక్షలు, మున్సిపాలిటీలకు రూ.25 కోట్లు, జిల్లాకు రూ.50 కోట్లు.. మహబూబాబాద్‌పై సీఎం కేసీఆర్ వరాల జల్లు

CM KCR Announces will Give Rs.10 Lakhs For Every Panchayat in Mahabubabad District,KCR will Inaugurate New Collectorates,KCR Inaugurate New Collectorates,New Collectorates in Mahabubabad,New Collectorates in Bhadradri,New Collectorates in Kothagudem,Mango News,Mango News Telugu,CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates

తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మహబూబాబాద్‌ జిల్లాపై వరాల జల్లు కురిపించారు. గురువారం ఆయన మహబూబాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీ నూతన కార్యాలయం మరియు నూతన సమీకృత కలెక్టరేట్ భవనాలకు ప్రారంభోత్సవం చేశారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం సమయంలో మహబూబాబాద్‌కు వచ్చానని, అప్పుడు తుంగతుర్తి, పాలకుర్తి, వర్ధన్నపేటలో కాల్వలు నీళ్లు లేక ఎండిపోయి ఉన్నాయి. జిల్లా అంతటా కరవు సమస్య ఉండేది. కానీ రాష్ట్రం ఏర్పడ్డాక జిల్లాపై ప్రేత్యేక దృష్టి పెట్టమని, ఇప్పుడు జిల్లా అయ్యి అభివృద్ధిలో పరుగులు పెడుతోందని పేర్కొన్నారు.

సీఎం కేసీఆర్ ప్రసంగంలోని కీలకాంశాలు..

  • రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కొత్త కలెక్టరేట్ భవనాలు నిర్మించుకుంటున్నాం.
  • ఈ క్రమంలోనే నేడు మహబూబాబాద్‌ పట్టణంలో నూతన కలెక్టరేట్ భవనం ప్రారంభించుకుంటున్నాం.
  • అయితే ఈ కార్యాలయాలు ప్రజలకు ఉపయోగపడేలా, వారి సమస్యలు తీర్చేవిగా ఉండాలి.
  • జిల్లాలో ఎన్నో తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చాం.
  • జిల్లా అభివృద్ధి కోసం సీఎం ప్రత్యేక నిధి నుండి నిధులు మంజూరు చేస్తాం.
  • ప్రతీ గ్రామ పంచాయతీకి రూ.10 లక్షలు, మున్సిపాలిటీలకు రూ.25 కోట్లు, జిల్లాకు రూ.50 కోట్లు అందిస్తాం.
  • జిల్లాకు ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీ మంజూరు చేస్తున్నాం.
  • ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో కేవలం 2, 3 వైద్య కళాశాలలు ఉండేవి.
  • కానీ ఇప్పుడు జిల్లాకు ఒకటి చొప్పున ఏర్పాటు చేసుకుంటున్నాం.
  • కేంద్రంలో పక్షపాత వైఖరి లేని ప్రభుత్వం వచ్చినప్పుడే అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి.
  • నాడు ఉద్యమ సమయంలో మద్దతిచ్చినట్లే ఇప్పుడు కూడా దేశ అభివృద్ధి కోసం చేసే పోరాటానికి తెలంగాణ ప్రజలు అండగా నిలవాలి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + two =