మహిళా ఉద్యోగులకు నేడు సెలవు, మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్

CM KCR Conveyed Greetings to Women in Telangana on the Occasion of International Women's Day

అభివృద్ధిలో మహిళలది అత్యంత కీలక పాత్ర అని తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళాలోకానికి సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. పురుషునితో నేడు అన్ని రంగాల్లో పోటీపడుతూ మహిళ తన ప్రతిభను చాటుకుంటున్నదన్నారు. జనాభాలో సగంగా వున్న మహిళలకు అవకాశాలు ఇస్తే అద్భుతాలు చేసి చూయిస్తారని సీఎం తెలిపారు. వారిని అభివృద్ధి పథంలో నడిపించేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నదని అన్నారు.

మహిళల భద్రత కోసం షీ టీమ్స్, వృద్ధ మహిళలు, ఒంటరి మహిళలు, వితంతువులకు పింఛన్లు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్, అంగన్ వాడీ, ఆశా వర్కర్లకు వేతనాల పెంపు సహా మహిళా సాధికారత కేంద్రంగా చేసుకుని తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్నదని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రం మహిళా సంక్షేమంలో ముందంజలో వున్నదని సీఎం తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చ్ 8, 2021 న రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ మహిళా ఉద్యోగులందరికీ సెలవు దినంగా ప్రకటిస్తున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ మేరకు సోమవారం నాడు మహిళా ఉద్యోగుల సెలవుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు ఇచ్చారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − seven =