న్యూఢిల్లీలోని వసంత్ విహార్ లో పార్టీ ఆఫీస్ నిర్మాణ ప‌నుల‌ను ప‌రిశీలించిన సీఎం కేసీఆర్

CM KCR Inspected the Construction Work of Party Office in Vasant Vihar New Delhi, CM KCR Inspected Party Office in Vasant Vihar, Brs To Commence Activities From Rented Building, BRS Party By Kcr, Mango News, Mango News Telugu, KCR National Party , TRS Party Live News And Updates, KCR New Party, BRS Party , TRS as Bharat Rashtra Samithi, TRS Name Changes To BRS, TRS Party, BRS Party Latest News And Live Updates, BRS Party Chief KCR, KCR, KTR, Kavitha Kalavakuntla

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రెండో రోజు ఢిల్లీ పర్యటనలో భాగంగా న్యూఢిల్లీలోని వసంత్ విహార్ లో పార్టీ ఆఫీస్ నిర్మాణ ప‌నుల‌ను ప‌రిశీలించారు. వసంత్ విహార్ లో 1,100 చదరపు మీటర్ల స్థలంలో పార్టీ ఆఫీస్ నిర్మాణం జరుగుతుంది. గత ఏడాది సెప్టెంబర్ 3న పార్టీ ఆఫీస్ నిర్మాణానికి సీఎం కేసీఆర్ భూమి పూజ నిర్వహించారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ బుధవారం నిర్మాణ పనులను పరిశీలించి, నిర్మాణ సంస్థ ప్రతినిధులు, ఇంజనీర్లకు పలు సూచనలు చేశారు. దాదాపు గంటసేపు అన్ని అంశాలను పరిశీలించి, పనులు జరుగుతున్న తీరును తెలుసుకుని, మరింత ముమ్మరంగా నిర్మాణం చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ తో పాటుగా రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీలు సంతోష్‌ కుమార్, దామోదరరావు, వద్దిరాజు రవిచంద్రలు కూడా ఉన్నారు.

మరోవైపు మంగళవారం సాయంత్రం న్యూఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కోసం సిద్ధమవుతోన్న కార్యాలయాన్ని కూడా సీఎం కేసీఆర్ పరిశీలించిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ కార్యాలయం కోసం చేస్తున్న మరమత్తులు, మార్పులపై సిబ్బందికి సీఎం కేసీఆర్ పలు సూచనలు చేశారు. వసంత్ విహార్ లో పార్టీ ఆఫీస్ నిర్మాణదశలో ఉన్నందున, ఏడాది కాలానికి సర్ధార్‌ పటేల్‌ పటేల్ మార్గ్‌లో జోధ్‌పూర్‌ వంశీయులకు చెందిన బంగ్లాను బీఆర్‌ఎస్‌ కార్యాలయ ఏర్పాటు కోసం లీజుకు తీసుకున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి బీఆర్ఎస్ కు ఆమోదం రాగానే లీజుకు తీసుకున్న ఈ కార్యాలయం నుంచే బీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + 6 =