ఏపీలో రైతులకు పైసా ఖర్చు లేకుండా వ్యవసాయ మోటార్లకు విద్యుత్ సంస్థలే మీటర్లు బిగిస్తాయి – సీఎం జగన్

AP CM Ys Jagan Mohan Reddy Held Review on Energy Department at Tadepalli camp Office Today, AP CM YS Jagan Mohan Reddy, AP CM Meet With Energy Department, Tadepalli camp Office Meeting With Energy Dept, Mango News, Mango News Telugu, YS Jagan Latest Scheme, AP CM Ys Jagan Mohan Reddy Latest Scheme, AP CM YS Jagan, YS Jagan Latest News And Live Updates, AP CM YS Jagan New Scheme, AP Electric Companies Install Meters For Agricultural Motors, No Cost Agricultural Motors Installation

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులకు ఒక్క పైసా ఖర్చు లేకుండా వ్యవసాయ మోటార్లకు విద్యుత్ పంపిణీ సంస్థలే మీటర్లు బిగిస్తాయని తెలిపారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి. బుధవారం ఆయన తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఇంధన శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్ సమీర్ శర్మ, ఏపీ జెన్‌కో ఎండీ శ్రీధర్ సహా పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ అధికారులకి పలు కీలక సూచనలు చేశారు.

సమీక్షలో సీఎం జగన్ చేసిన కొన్ని సూచనలు..

  • రాష్ట్రంలో రైతులకు ఒక్కపైసా కూడా ఖర్చు కాకుండా విద్యుత్‌ పంపిణీ సంస్థలే మీటర్లను బిగిస్తాయి.
  • రైతుల వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్‌ పంపిణీ అత్యంత పారదర్శకంగా, నాణ్యంగా ఉండాలి.
  • మీటర్లు పెట్టడం వల్ల కలుగుతున్న ప్రయోజనాలపై ఎప్పటికప్పుడు రైతులకు తెలియజేయాలి.
  • వినియోగించుకున్న విద్యుత్‌కు అయ్యే ఖర్చును కూడా నేరుగా రైతుల ఖాతాల్లోకి పంపుతారు.
  • వారి ఖాతాలనుంచి ఆ డబ్బు నేరుగా విద్యుత్‌ పంపిణీ సంస్థలకు చేరుతుంది. దీనిపై రైతులకు అవగాహన కల్పించాలి.
  • ఈ ప్రక్రియ కారణంగా విద్యుత్‌ పంపిణీ సంస్థలు రైతులకు జవాబుదారీగా ఉంటాయి.
  • శ్రీకాకుళం జిల్లాలో చేపట్టిన పైలట్‌ ప్రాజెక్టు విజయవంతం అయింది.
  • మోటార్ల వాళ్ళ విద్యుత్ ఆదా అయ్యి, తద్వారా రైతులకు లబ్ది చేకూరుతోంది.
  • రాష్ట్రంలో బొగ్గు నిల్వలకు ఎలాంటి కొరత లేకుండా అధికారులు దృష్టి పెట్టాలి.
  • విదేశీ బొగ్గు ధరలు మండిపోతున్న దృష్ట్యా దేశీయంగానే సమకూర్చేకునేలా ప్రయత్నాలు చేయాలి.
  • వచ్చే ఏడాది వేసవి కోసం ఇప్పటినుంచే ప్రత్యేక ప్రణాళిక సిద్ధంచేసుకోవాలి.
  • సులియారీ, మహానది కోల్‌బాక్స్‌ నుంచి పూర్తిస్థాయి ప్రయోజనాలు పొందేలా ప్రయత్నించాలి.
  • ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న జగనన్న కాలనీల్లో విద్యుత్ సదుపాయాలు, నిర్వహణపై దృష్టి పెట్టాలి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − two =