అంబేడ్కర్‌ జన్మించిన నేలన దళితబంధు వంటి పథకం ఎందుకు లేదు? – కంధార్‌-లోహా సభలో సీఎం కేసీఆర్‌

CM KCR Lashes Out BJP Govt in BRS Public Meeting at Kandhar Loha in Nanded Maharashtra,CM KCR Lashes Out BJP Govt,BRS Public Meeting at Kandhar Loha,BRS Meeting in Nanded Maharashtra,Mango News,Mango News Telugu,BRS Party,CM KCR News And Live Updates,BRS Public Meeting Latest News,BRS Public Meeting Latest Updates,Maharashtra BRS Meeting Live,Maharashtra BRS Meeting News Today,BRS Party Political News And Updates

రాజ్యాంగ రూపకర్త డా. బీఆర్ అంబేడ్కర్‌ జన్మించిన నేలన దళితబంధు వంటి పథకం ఎందుకు లేదు? అని ప్రశ్నించారు బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు. ఈ మేరకు ఆయన ఆదివారం మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లా కంధార్‌-లోహా పట్టణంలో బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. కాగా గత నెలలో నాందేడ్‌లో నిర్వహించిన బహిరంగ సభ తర్వాత మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ నిర్వహించిన రెండో సమావేశం ఇదే కావడం విశేషం. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. శివాజీ మహరాజ్‌ జన్మించిన పావన ధాత్రికి, మరాఠా భూమికి వందనం అని తెలిపిన ఆయన, త్వరలో బీఆర్‌ఎస్‌ పార్టీ నేతృత్వంలో మహారాష్ట్రలో సృష్టించబోయే రైతు తుఫాన్‌ను ఎవరూ అడ్డుకోలేరని అన్నారు. తనను మహారాష్ట్రకు రావొద్దని డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ అంటున్నారని, తెలంగాణ తరహా రైతు మాడల్‌ను మహారాష్ట్రలో అమలు చేసేదాకా బరాబర్‌ వస్తానని, రైతుల కోసం పోరాటం చేస్తూనే ఉంటానని స్పష్టం చేశారు.

తెలంగాణకు చెందిన కేసీఆర్‌కు ఇక్కడేం పని? అని ఫడ్నవీస్‌ తనను ప్రశ్నిస్తున్నారని, తాను భారతీయుడినని, దేశంలోని ఏ రాష్ష్ట్రానికైనా వెళ్లే హక్కు తనకు ఉందని స్పష్టం చేశారు. ఇక్కడి బీజేపీ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నానని, తెలంగాణలో అమలు చేస్తున్న రైతు విధానాలను మహారాష్ట్రలో అమలు చేయగలరా? అని కేసీఆర్‌ నిలదీశారు. తెలంగాణ రైతులకు ప్రతి ఎకరానికి పెట్టుబడి సాయంగా రూ.10 వేలు ఇస్తున్నామని, రైతులకు ఉచితంగా నాణ్యమైన 24 గంటల ఉచిత కరెంటును ఇస్తున్నామని తెలిపారు. అలాగే తెలంగాణలో రైతులకు రూ.5 లక్షల రైతుబీమా అందిస్తున్నామని, అలాగే రైతులు పండించిన ప్రతి గింజను దాదాపు 7వేల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నదని వెల్లడించిన సీఎం కేసీఆర్ ఇవన్నీ మహారాష్ట్రలో అమలు చేయగలరా? అని బీజేపీ నేతలను ప్రశ్నించారు. ఇక నాందేడ్‌ ప్రజలు తనపై అపరమైన ప్రేమ చూపిస్తున్నారని, అందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలని తెలిపిన సీఎం కేసీఆర్.. ఇక పశ్చిమ మహారాష్ట్రకు చెందిన కొందరు తనను సోలాపూర్‌ రావాలని కోరుతున్నారని, తప్పకుండా వస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + 12 =