దేశ రక్షణ విషయంలో ఏమాత్రం రాజీపడొద్దు, అంతా ఒక్కతాటిపై నిలవాలి – సీఎం కేసీఆర్

CM KCR, CM KCR Responds over India-China Issue, Highlights Of PM Modi Video Conference, India-China Border, India-China Border Clash News, India-China Border Tensions, India-China Issue, KCR over India-China Issue in Video Conference with PM Modi, PM Modi Video Conference, PM Modi Video Conference with Chief Ministers, PM Modi Video Conference with CMs

దేశ రక్షణ విషయంలో ఏమాత్రం రాజీపడవద్దని, దేశమంతా ఒక్కతాటిపై నిలవాలని, ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రజలు కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలుస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూన్ 17, బుధవారం నాడు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో భారత్ – చైనా సరిహద్దులో జరిగిన ఘర్షణ అంశాన్ని కేసీఆర్ ప్రస్తావించారు. చైనా గానీ, మరే దేశంగానీ భారత్ సార్వభౌమత్వం విషయంలో వేలు పడితే, తప్పక ప్రతిఘటించాలని, తగిన సమాధానం చెప్పాలని సీఎం కేసీఆర్ అన్నారు.

దేశ రక్షణ విషయంలో ఎవరూ రాజకీయం చేయాల్సిన అవసరం లేదని, దేశమంతా ఒక్కతాటిపై నిలబడాల్సిన సమయం ఇదని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభంలో ప్రధాన మంత్రితో పాటు, అందరు ముఖ్యమంత్రులు లద్దాఖ్ ప్రాంతంలో జరిగిన ఘర్షణలో చనిపోయిన సైనికులకు రెండు నిముషాలు మౌనం పాటించి నివాళి అర్పించారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + fifteen =