ఈడీ కాకపోతే బోడీ పెట్టుకో, నిజాయితిగా ఉన్నవాళ్లు ఎందుకు భయపడతారు?: సీఎం కేసీఆర్

Telangana CM KCR Speech at TRS Praja Deevena Public Meeting at Munugode, CM KCR Speech at TRS Praja Deevena Public Meeting at Munugode, TRS Praja Deevena Public Meeting at Munugode, Munugode TRS Praja Deevena Public Meeting, TRS Praja Deevena Public Meeting, Telangana CM KCR, TRS Praja Deevena Sabha, CM KCR Public Meeting, Upcoming Munugode Assembly By Election, Munugode By Election, Munugode By Poll, Munugode TRS Praja Deevena Public Meeting News, Munugode TRS Praja Deevena Public Meeting Latest News And Updates, Munugode TRS Praja Deevena Public Meeting Live Updates, Mango News, Mango News Telugu,

మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం మునుగోడు మండల కేంద్రంలో అధికార టీఆర్ఎస్ పార్టీ ‘ప్రజా దీవెన’ పేరుతో భారీ బ‌హిరంగ స‌భ నిర్వ‌హించింది. ఈ సభకు హాజరయ్యేందుకు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హైదరాబాద్‌ నుంచి రోడ్డు మార్గం ద్వారా భారీ కాన్వాయ్‌ తో వేదిక వద్దకు చేరుకున్నారు. ముందుగా వేదిక వద్ద గులాబీ జెండా ఎగుర వేసి, తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం సభకు హాజరైన ప్రజలనుద్దేశించి సీఎం కేసీఆర్ కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా కేంద్రం తీరుపై, ప్రధాని మోదీ, రాష్ట్ర బీజేపీ నాయకులపై మరోసారి సీఎం విమర్శలు గుప్పించారు. మునుగోడులో మద్ధతు తెలిపిన సీపీఐ పార్టీకి, నాయకులకు సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఐక్యత మునుగోడు నుంచి ఢిల్లీ వరకు కొనసాగాలని, టీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం ఇతర ప్రగతిశీల శక్తులు ఏకమై పనిచేస్తామన్నారు.

రాష్ట్రం ఏర్పడి 8 ఏళ్లు అయినా కృష్ణా వాటాపై ప్రధాని మోదీ తేల్చడం లేదని, కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చకుండా ఏ మొఖం పెట్టుకొని మునుగోడుకు వస్తున్నారని బీజేపీ నేతలపై సీఎం కేసీఆర్ మండిపడ్డారు. నీళ్లలో వాటా ఇవ్వనందుకే రేపు మునుగోడుకు వస్తున్నావా అని కేంద్రమంత్రి అమిత్ షాను సీఎం ప్రశ్నించారు. ఈ అంశంపై అమిత్ షా రేపు మునుగోడులో సమాధానం చెప్పాలన్నారు. బీజేపీ ప్రభుత్వం వచ్చి 8 ఏళ్లు అయినా రైతులకు, మహిళలకు, దళితులకు, కార్మికులకు కానీ ఎవరికైనా ఒక్క మంచి పని జరిగిందా? వాళ్లకు మేలు జరిగితే మాకు కనిపించదా అని సీఎం విమర్శించారు.

ఈడీ కాకపోతే బోడీ పెట్టుకో, నిజాయితిగా ఉన్నవాళ్లు ఎందుకు భయపడతారు?:

“ఇది ప్రజాస్వామ్యమా? అహంకారామా?, ఏందిది?, ఇది దేశమా? అరాచకమా? ఎవరిని పడితే వాళ్లను ముఖ్యమంత్రులను, పెద్దపెద్ద వాళ్లను, నీ మీద ఈడీ కేసు పెడుతానంటే ఈడీనా, బోడినా రా అని చెప్పినా. దొంగలు భయపడుతరు. ధర్మంగా ఉన్నవాళ్లు, నిజాయితిగా ఉన్నవాళ్లు ఎందుకు భయపడతారు?, నీ మీద ఈడీ పెడుతమంటే ఈడీ కాకపోతే బోడీ పెట్టుకో, ఏం పీక్కుంటవో పీక్కో. ప్రజల కోసం నిలబడే వాళ్లు, ప్రజల కోసం ఆలోచించే వాళ్లు, ప్రజల మేలుకోరే వాళ్లు, పేద ప్రజలకు కడుపునిండా బుక్కెడు అన్నం దొరకాలనే వారు, నీకు భయపడురు మోదీ. నువ్వు గోకినా, గోకకపోయినా, నేనే నిన్ను గోకుతా అని చెప్పినా, ఇది దేశం ఎవని అయ్య సొత్తు కాదు” అని సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − 7 =