తెలంగాణాలో కోవిడ్ 19 థర్డ్ వేవ్ వచ్చే అవకాశం?

Coronavirus, COVID 19 Updates, Covid B.1.1.529 variant, COVID-19, covid-19 new variant, Covid-19 Third wave, COVID-19 Third Wave Could Be Danger In Telangana, COVID-19 Third Wave In Telangana, Covid-19 Updates in Telangana, Mango News, New coronavirus Strain, New Covid 19 Variant, New Covid Strain Omicron, Omicron, Omicron covid variant, Omicron variant, omicron variant in India, omicron variant south africa, Telangana braces for possible Covid third wave, telangana coronavirus cases today, telangana coronavirus district wise, Telangana Coronavirus News, telangana covid cases today list, Update on Omicron

తెలంగాణాలో కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందా? ప్రస్తుత పరిణామాలు గమనిస్తుంటే, అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎందుకంటే, తెలంగాణాలో కరోనా కేసులు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. డిసెంబర్ 1వ తేదీన 184 కరోనా కేసులు నమోదయితే, డిసెంబర్ 2వ తేదీన 189 కేసులు నమోదయ్యాయి. ఆ సంఖ్య క్రమంగా పెరుగుతూ డిసెంబర్ 3వ తేదీకి 198, డిసెంబర్ 4వ తేదీ నాటికి 213 కి చేరుకుంది. అయితే, డిసెంబర్ 5వ తేదీన ఇది కొంచెం తగ్గుముఖం పట్టి 156 కేసులు నమోదయ్యాయి. అయితే, ఇలా క్రమంగా కేసులు పెరగటం ఆందోళన కలిగించే విషయమే.

కాగా, ఇలా రోజువారీ నమోదవుతున్న కేసుల్లో డెల్టా వేరియెంట్ కానీ, ఒమిక్రాన్ వేరియెంట్ కానీ వెలుగు చూస్తే దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు నిర్లక్ష్యంగా ఉండొద్దని, చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. మాస్కులు ధరించటం, భౌతికదూరం పాటించటం, తరచుగా చేతులు శానిటైజ్ చేసుకోవటం, వాక్సిన్ రెండు డోసులు తీసుకోవటం మొదలైన జాగ్రత్తలు ఎప్పటికప్పుడు పాటించాలని వైద్య నిపుణులు చెప్తున్నారు. విదేశాలనుంచి వచ్చిన అందరికి టెస్టులు నిర్వహిస్తున్నారు. ఏ క్షణంలో అయినా హైదరాబాద్ లో ఒమిక్రాన్ వేరియెంట్ కేసులు వెలుగు చూడవచ్చని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు హెచ్చరించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − 10 =