ధరణి వ్యవస్థపై కొత్తగా నియమితులైన పది జిల్లాల కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్

10 new Collectors get orientation on Dharani portal, Chief Secretary Somesh Kumar, CS Conducted a Orientation on Dharani System, CS Somesh Kumar, CS Somesh Kumar Conducted Orientation on Dharani System, CS Somesh Kumar Conducted Orientation on Dharani System to Newly Appointed District Collectors, CS Somesh Kumar Conducted Orientation on Dharani System to Newly Appointed District Collectors of 10 Districts, Dharani System, Dharani System is one of the most prestigious projects, Mango News

రాష్ట్రంలో పది జిల్లాలకు కొత్తగా నియమితులైన జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ శనివారం నాడు బిఆర్కెఆర్ భవన్ నుండి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ధరణి వ్యవస్థపై ఓరియేంటేషన్ అవగాహన కల్పించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆకాంక్షలు, ముందు చూపుతో చేసిన సూచనల ప్రకారం ధరణి పోర్టల్ ను అభివృద్ధి చేసినట్లు సీఎస్ తెలిపారు. భూ రికార్డులను సమగ్రంగా ఏకీకృతంగా నిర్వహించుటకు ట్రాన్స్ యాక్షన్ లను ఎప్పటికప్పుడు ఆధునీకరించడానికి ప్రభుత్వం చేపట్టిన అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టులలో ఇది ఒకటి అని సీఎస్ తెలిపారు. భూ సమస్యలను పరిష్కరించడానికి దేశంలోని మరే ఇతర రాష్ట్రంలో ఈ వ్యవస్థను అమలు చేయడం లేదని అన్నారు. ధరణి ప్రారంభించిన ఒక సంవత్సరం కాలంలోనే 8 లక్షలకు పైగా లావాదేవీలు జరిగాయి. ధరణి పోర్టల్ ఇప్పటివరకు 4 కోట్లకు పైగా హిట్లను పొందింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, పారదర్శకంగా పనిచేసే విధంగా ధరణి మాడ్యూల్స్ ను అభివృద్ధి చేసినట్లు తెలిపారు.

ధరణి ఆపరేటింగ్ సిస్టమ్ మొత్తం ఆన్ లైన్ స్లాట్ బుకింగ్ ఆధారంగా మాత్రమే పని చేస్తుందని సీఎస్ సోమేశ్ కుమార్ అన్నారు. ఈ వ్యవస్థను సక్రమంగా అమలు చేసేలా చూడాలని, పెండింగ్ లో ఉన్న ధరణి గ్రీవేన్స్ ను క్లియర్ చేయడానికి ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ధరణి గ్రీవేన్స్ ను పరిష్కరించడంపై ఉదాహరణలతో జిల్లా కలెక్టర్లకు వివరించారు. ఈ వీడియోకాన్ఫరెన్స్ లో సిఐజి వి.శేషాద్రి, ఎండి, టిఎస్టిఎస్ జి.టి.వెంకయ్యరావు, ఓఎస్డీ టూ హెఛ్సీఎం రామయ్య, హరిత, నల్గొండ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, మెదక్ కలెక్టర్ హరీష్, రాజన్న సిరిసిల్ల కలెక్టర్ అనురాగ్ జయంతి, వరంగల్ కలెక్టర్ బి.గోపి, నాగర్ కర్నూలు కలెక్టర్ పి.ఉదయ్ కుమార్, కామారెడ్డి కలెక్టర్ జితేష్ వి.పాటిల్, జనగాం కలెక్టర్ సిహెచ్.రామలింగయ్య, జోగులంబ గద్వాల కలెక్టర్ వల్లూరి క్రాంతి, యదాద్రి భువనగిరి కలెక్టర్ పమేలా సత్పతిలు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 + 9 =