రాష్ట్రంపై గులాబ్ తుఫాన్ ప్రభావం, అధికారులకు సీఎస్ కీలక ఆదేశాలు

CS Somesh Kumar, CS Somesh Kumar held Teleconference with District Collectors, CS Somesh Kumar Held Teleconference with District Collectors on Gulab Toofan, CS Teleconference with District Collectors on Gulab Toofan, Cyclone Gulab alert, Cyclone Gulab Update, Cyclonic Storm Gulab, Gulab Toofan, Mango News, Red Alert for Telangana, Telangana CS directs Collectors on Gulab Toofan, Telangana CS directs Collectors to keep vigil on Gulab Toofan, Telangana Gulab Toofan

తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి అపప్రమత్తం చేశారు. న్యూఢిల్లీలో జరిగిన సీఎంల సమావేశంలో పాల్గొనడానికి సీఎం కేసీఆర్ తో వెళ్లిన సోమేశ్ కుమార్ న్యూఢిల్లీ నుండే కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆదివారం సాయంత్రం నుండి ఎల్లుండి వరకు గులాబ్ తుఫాన్ ప్రభావం రాష్ట్రం మొత్తంపై ఉన్నందున ప్రతీ జిల్లా కలెక్టరేట్ లలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఉత్తర తెలంగాణ జిల్లాలకు రెడ్ అలర్ట్, దక్షణ తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అల్లర్ట్ గా ప్రకటించారు. పోలీస్ ఇతర లైన్ డిపార్ట్మెంట్ లతో సమన్వయంతో పని చేయాలని, లోతట్టు ప్రాంతాలపట్ల అప్రమత్తంగా ఉండడంతో పాటు, తెగడానికి అవకాశం ఉన్న చెరువులపై ప్రత్యేక నిఘా వహించి ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు.

అవసరమైతే ఎన్.డీ.ఆర్.ఎఫ్. సేవలను పొందాలని, ప్రస్తుతం వరంగల్, మంచిర్యాల, కొత్తగూడెంలలో ఎన్.డీ.ఆర్.ఎఫ్ బృందాలున్నాయని చెప్పారు. వాగులు, వంకల నుండి వరద నీరు ప్రవాహ సమయంలో వాటిని దాటకుండా ఆయా ప్రాంతాల్లో నిఘా ఉంచాలని అన్నారు. ప్రతి మండలంలో ప్రత్యేక అధికారులను నియమించి ఏవిధమైన ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా చూడాలని సూచించారు. స్థానికుల సహాయంతో వరద నష్టం నివారణ చర్యలను చేపట్టాలన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో సిబ్బంది, అధికారులను అప్రమత్తంగా ఉండాలి. పూర్తిగా నిండిన హిమాయత్ సాగర్ , ఉస్మాన్ సాగర్ జలాశయాల్లో నీటి మట్టాలను పర్యవేక్షిస్తుండాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ టెలికాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్లలతో పాటు రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, పంచాయితీ రాజ్, ఇంధన శాఖ కార్య దర్శి సందీప్ సుల్తానియా పాల్గొన్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here