ఒకే పేరుతో బరిలో నిలబడ్డ వేర్వేరు అభ్యర్థులు

Different candidates contested under the same name,Different candidates contested,contested under the Same Name,Mango News,Mango News Telugu,Telangana Assembly Election 2023,voters Confusion, leaders, Different candidates, Assembly Election, BRS , BJP, TDP, Congress, KCR, Election,BRS Latest News,Telangana assembly elections Latest News,Telangana assembly elections Latest Updates,Telangana assembly elections Live News,Telangana Politics, Telangana Political News And Updates
Telangana Assembly Election 2023 , voters Confusion, leaders, Different candidates, Assembly Election, BRS , BJP, TDP, Congress, KCR, Election,

తెలంగాణ శాసన సభ ఎన్నికలకు ఇంకా  కొన్ని రోజులు మాత్రమే సమయం ఉండటంతో..అభ్యర్థులలో టెన్షన్ మొదలయింది. ఇప్పటి వరకూ ఓటర్లను ఎలా ఆకట్టుకోవాలా అని స్ట్రాటజీలు ఫాలో అవుతున్న నేతలకు..కొన్ని నియోజకవర్గాల ఓటర్లకు ఈవీఎంలో అభ్యర్థుల వెతుకులాటే ఓ పజిల్‌గా మారనుందన్న విషయం షాక్ కొడుతోంది. ఎందుంటే చాలా చోట్ల ప్రధాన అభ్యర్థులకు పోటీగా..  అదే పేరున్న వ్యక్తులు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగుతూ టెన్షన్ పెట్టడానికి సిద్ధం అయ్యారు.

ప్రధాన అభ్యర్థులకు పోటీగా అదే పేరుతో స్వతంత్ర అభ్యర్థులు పోటీకి దిగడంతో తాము ఓటేసే అభ్యర్థి పేరును ఎంచుకోవడానికి ఓటర్లు కన్ఫ్యూజ్ అయ్యే పరిస్తితి తలెత్తనుంది. ఇందులో తాము ఓటు వేయాలనుకున్న  ప్రధాన అభ్యర్థి ఎవరు? స్వతంత్ర అభ్యర్థి ఎవరు అనేది కచ్చితంగా అయోమయంలోకి నెట్టేసే పరిస్థితి నెలకొంది.

ఎన్నికలలో ప్రధానంగా ప్రజల్లోకి దూసుకుపోయేది ఒకటి పార్టీ గుర్తు అయితే.. మరోది వారి పేరు. అందుకే కొంతమంది ప్రధాన పార్టీల అభ్యర్థుల ఓట్లను చీల్చి..   వారి విజయాన్ని ప్రభావితం చేయడానికి అదే పేరున్న వ్యక్తులను స్వతంత్రులుగా నిలబడ్డారు.  అయితే మరికొన్ని చోట్ల అపోజిషన్ నేతలే అలాంటి పేరున్న వ్యక్తిని వెతికి మరీ పట్టుకుని వారితో నామినేషన్లు వేయించారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

అభ్యర్థుల ఇంటి పేరు వేరుగా ఉన్నా .. అసలు పేరు ఒకటే కావడంతో అభ్యర్థులకు కొత్త  తలనొప్పి మొదలయింది. ఒకే పేరున్న స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లను.. కొన్నిచోట్ల స్క్రూటినీలో తిరస్కరించగా మరికొందరు మాత్రం ఇంకా బరిలోనే ఉండి అక్కడ నిలబడ్డ అభ్యర్థులకు టెన్షన్ పుట్టిస్తున్నారు. అంతేకాదు కొన్నిచోట్ల ఏకంగా  కొంతమంది అభ్యర్థుల పేరుతో పాటు ఇంటిపేరు కూడా ఒకటే ఉండటంతో అభ్యర్థులు ఏం చేయాలో తెలయక తలలు పట్టుకుంటున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ అభ్యర్థులు ఉన్న చోటే ఇలా అదే పేరుతో ఉన్న స్వతంత్ర అభ్యర్థులుగా నిలబడటం హాట్ టాపిక్ అయింది.

ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్‌ నుంచి మంత్రి పువ్వాడ అజయ్‌ పోటీ చేస్తున్నారు. అయితే ఇక్కడ  ఎ.అజయ్‌, కె. అజయ్‌ పేరున్న  స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలిచారు.అలాగే కొడంగల్‌లో పట్నం నరేందర్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేస్తుండగా..అక్కడ ప్యాట నరేందర్‌రెడ్డి అనే వ్యక్తి స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి నిలబడ్డారు.నారాయణపేట నియోజకవర్గంలో..  బీఆర్ఎస్ అభ్యర్థిగా  ఎస్‌. రాజేందర్‌రెడ్డి బరిలో దిగగా..ఇక్కడ కె. రాజేందర్‌రెడ్డి ఇండిపెండెంటుగా నిలబడ్డారు.

హుజూర్‌నగర్‌లో బీఆర్ఎస్ నుంచి శానంపూడి సైదిరెడ్డి పోటీకి దిగగా.. ఏడీఆర్‌ నుంచి టి. సైదిరెడ్డి నిలబడ్డారు. అలాగే  మహబూబ్‌నగర్‌లో మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ బరిలో దిగగా..  ఎం. శ్రీనివాసులుగౌడ్‌ అనే వ్యక్తి స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగుతున్నారు. ఉప్పల్‌లో బీఆర్‌ఎస్‌ నుంచి బండారి లక్ష్మారెడ్డి పోటీకి దిగగా.. ఏడీఆర్‌ పార్టీ అభ్యర్థిగా మన్నె లక్ష్మారెడ్డి బరిలోకి దిగుతున్నారు. ఇబ్రహీంపట్నంలో మంచిరెడ్డి కిషన్ రెడ్డి బీఆర్‌ఎస్‌ అభ్యర్ధిగా బరిలోకి దిగగా…కెన కిషన్‌రెడ్డి ఏడీఆర్‌ అభ్యర్థిగా పోటీ పడుతున్నారు.

మునుగోడులో బీఆర్‌ఎస్‌ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి పోటీకి దిగగా.. సర్ నేమ్ కూడా ఒకేలా ఉన్న కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఏడీఆర్‌  అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఎల్బీనగర్‌లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి బరిలోకి దిగగా.. స్వతంత్రులుగా దేవిరెడ్డి సుధీర్‌రెడ్డితో పాటు డి.సుధీర్‌రెడ్డి పోటీ పడుతున్నారు. మిర్యాలగూడలో కాంగ్రెస్ అభ్యర్థిగా  బి. లక్ష్మారెడ్డి పోటీలో నిలబడగా.. అదే పేరుతో ఉన్న బి. లక్ష్మారెడ్డి ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా బరిలో దిగారు.

మహేశ్వరంలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పి.సబిత బరిలో నిలబడిన చోట.. స్వతంత్ర అభ్యర్థిగా ఎం.సబిత పోటీగా నిలబడ్డారు. అలాగే కాంగ్రెస్‌ అభ్యర్థిగా కె.లక్ష్మారెడ్డి బరిలో దిగగా.. జనశంఖారావం అభ్యర్థిగా కో. లక్ష్మారెడ్డి  పోటీ పడుతున్నారు.ఇక దేవరకద్రలో సిట్టింగ్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి అయిన  ఆళ్ల వెంకటేశ్వరరెడ్డి నిలబడగా.. అదే పేరున్న అభ్యర్థి స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగారు.  అంతేకాదు అచ్చంపేటలో బీఆర్‌ఎస్‌ నుంచి గువ్వల బాలరాజుపై..  ఏడీఆర్‌ పార్టీ అభ్యర్థిగా అదే పేరున్న గువ్వల బాలరాజు నిలబడ్డారు. తమ పార్టీకి నష్టం తేవాలనే ఇలా నిలబెట్టారంటూ బీఆర్ఎస్ అభ్యర్థులు గగ్గోలు పెడుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − 10 =