గిరిజనుల అభివృద్ధికి సమగ్రమైన దృక్పథంతో ముందుకు పోవాలి: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్

Governor Tamilisai Soundararajan Calls for Holistic Approach Towards Tribal Empowerment

రాష్ట్ర జనాభాలో 10 శాతంపైగా ఉన్న గిరిజనుల అభివృద్ధికి సమగ్రమైన దృక్పథంతో ముందుకు పోవాలని తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు. పీవీ నరసింహారావు తెలంగాణ స్టేట్ వెటర్నరీ యూనివర్సిటీ క్యాంపస్ లో శనివారం జరిగిన ఒక ప్రత్యేకమైన కార్యక్రమంలో గవర్నర్ పాల్గొని ఆదిమ జాతి గిరిజన తెగలకు చెందిన కొంతమందికి రాజశ్రీ రకం నాటు కోళ్లను, కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ, గిరిజనుల సమగ్ర సామాజిక, ఆర్ధిక, విద్య అభివృద్ధికి, వారి స్వయం ఉపాధి, ఇతర జీవనోపాదుల మెరుగు కోసం మరింత చొరవతో పనిచేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. గిరిజన మహిళల్లో, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలలో పోషకాహార లోపాలు ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగించే విషయం అన్నారు. మంచి పోషకాలతో కూడిన ఇప్ప పువ్వుతో తయారయ్యే మహువా లడ్డును వీరికి అందించడం ద్వారా మంచి పోషకాలను అందించే అవకాశం ఉందని గవర్నర్ వివరించారు.

అదిలాబాద్, భద్రాద్రి-కొత్తగూడెం, నాగర్ కర్నూల్ జిల్లాలలోని కొన్ని ఆదిమ జాతి ప్రజల ఆవాసాలలో చేపట్టిన ప్రత్యేక పోషకాహార పైలెట్ ప్రాజెక్ట్ నిరంతరం కొనసాగాలని గవర్నర్ సూచించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, జాతీయ పోషకాహార సంస్థ, ఈఎస్ఐ మెడికల్ కాలేజ్, వ్యవసాయ, హార్టికల్చర్, వెటర్నరీ, ఆరోగ్య విశ్వవిద్యాలయాల సమన్వయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు గిరిజన ప్రజల సమగ్ర అభివృద్ధికి పాటుపడేంత వరకూ కొనసాగాలని గవర్నర్ స్పష్టం చేశారు. రాజశ్రీ రకం దేశి కోళ్ల పంపిణీ ద్వారా ఆదిమ జాతి గిరిజన ప్రజల స్వయం ఉపాధికి, వారిలో పోషకాల పెంపుకు ఉపయోగపడుతుందని గవర్నర్ తమిళిసై ఆశాభావం వ్యక్తం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six + nine =