కాంగ్రెస్ టార్గెట్‌గా బీజేపీ మాస్టర్ ప్లాన్

Is this the BJPs plan behind the Janasena contest,Is this the BJPs plan,BJPs plan behind the Janasena contest,Behind the Janasena contest,Telangana Elections 2023,BJPs plan,Janasena contest,BJP,Congress,BRS,Mango News,Mango News Telugu,CM KCR Latest News and Updates,Telangana Politics,Telangana Assembly polls,Telangana Elections 2023,Telangana Elections Latest News,Telangana Elections Latest Updates,Telangana Elections Live News
Telangana Elections 2023,BJP's plan,Janasena contest,BJP,Congress,BRS,

తెలంగాణలో ఎన్నికలు ఎన్నడూ లేనంతగా రసవత్తరంగా మారాయి. ఎవరికి వారే బయటకు గెలుపుపై ధీమాను వ్యక్తం చేస్తున్నా.. లోలోన మాత్రం టఫ్ ఫైట్ గురించి టెన్షన్ పడుతూనే ఉన్నారు. ఇజ్జత్ కా సవాల్ అంటూ పైసలు ఖర్చు పెడుతున్నా.. రేపు గెలుస్తామా లేదా అన్న అనుమానంతో భయభయంగానే ఉంటున్నారు. దీనికి తోడు ఈ సారి బీఆర్ఎస్ సీన్ సితారే  అన్నట్లుగా టాక్ రావడంతో బీఆర్ఎస్ , బీజేపీ నేతల గుండెళ్లో రైళ్లు పరుగెడుతున్నాయి.

తెలంగాణ కొత్త రాష్ట్రంగా అవతరించిన దగ్గర నుంచీ బీఆర్ఎస్ పాలనే ఉండటంతో ఈ సారీ ఎలాగైనా హ్యాట్రిక్ కొట్టాలనే  పట్టుదలతో కేసీఆర్ ఉన్నారు. కానీ సర్వేలు భయపెడుతుండటంతో దానికి తగ్గట్టుగా హామీలు ఇస్తూ , ఓటర్లను ఆకట్టుకునేలా ప్రచారాలు నిర్వహించారు  గులాబీ బాస్. ఇక బీజేపీ కూడా ఎన్నడూ లేనంతగా తెలంగాణపైనే ఫోకస్ పెంచింది. మోడీ, అమిత్ షా వంటి పెద్దలు తెలంగాణ ఎన్నికలను ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకున్నారు. కాంగ్రెస్ వస్తే జరిగేది ఇదేనంటూ రెండు ప్రధాన పార్టీలు ప్రజలకు చెబుతూనే..మరోవైపు తమ రాజకీయ చతురతతో పక్కాగా కాంగ్రెస్‌ను ఓడించడానికి ప్లాన్‌ కూడా వేసినట్లు తెలుస్తోంది.

నిజానికి మొన్నటి వరకూ తెలంగాణలో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ రాజకీయాలు మాత్రమే కనిపించేవి. కానీ ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత సీన్ మారిపోయి.. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనేలా పరిస్థితులు తలక్రందులయ్యాయి.  కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అంతకు ముందు కంటే భిన్నంగా ఈ ఎన్నికల్లో పని చేస్తున్నారు. అంతర్గత కుమ్ములాటలను పక్కన పెట్టి మరీ ఐక్యతా రాగాన్ని ఆలపిస్తున్నారు. కీలక నేతలంతా విస్తృతంగా ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు. బీఆర్ఎస్‌పై ఉన్న అసంతృప్తిని కాంగ్రెస్ నేతలు తమకు అనుకూలంగా మార్చుకున్నారు.

మారిన పరిస్థితులను మళ్లీ చేజారనివ్వకుండా బీఆర్ఎస్ ప్రయత్నిస్తుండగా.. బీజేపీ మాస్టర్ ప్లాన్‌తో ముందుకెళ్తుంది. కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులను ఓడించడానికి .. వారు పోటీ చేస్తున్న కొన్ని స్థానాల్లో పవన్‌కున్న ఇమేజ్‌ను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి.. జనసేన అభ్యర్థులను రంగంలోకి దింపింది.నిజానికి ఇవి ఎనిమిది స్థానాలే అయినా కూడా.. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎలా అయినా గెలుస్తాం అన్న ఆశలు పెంచుకున్న స్థానాల్లో ఇవి కూడా ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో బీజేపీ, జనసేనతో పొత్తులో భాగంగా.. అక్కడి సీట్లలో బీజేపీ పోటీ చేయకుండా జనసేనకు కేటాయించింది.

జనసేనకి 8 స్థానాల్లో కేటాయించిన సీట్లల్లో.. చాలా వరకు కుల సమీకరణలనే భారతీయ జనతా పార్టీ  పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సెటిలర్లు ఎక్కువగా ఇష్టపడే అభిమాన నటుడుగా పవన్‌కు కావాల్సినంత ఇమేజ్ ఉంది.  అంతేకాకుండా కాపు సామాజిక వర్గం బలంగా ఉన్నట్లు సర్వేలు తేల్చాయి. దీంతో కాంగ్రెస్‌ను డీ కొట్టడానికి జనసేనను రాజకీయ సమరంలోకి దింపింది బీజేపీ. దీనివల్ల  కాంగ్రెస్‌కు పడాల్సిన ఓట్లు, బీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లు జనసేనకే పడతాయని బీజేపీ అధిష్టానం లెక్కలు వేసింది.

ఓట్లు చీలడం వల్ల కాంగ్రెస్ అభ్యర్థులను దెబ్బతీయడానికి ఆ స్థానాలలో జనసేనను దింపిందనే  చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాలలో సాగుతుంది. బీజేపీ అంచనాలు ఏమాత్రం దెబ్బతినకుండా అక్కడ పరిస్థితులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.  కొన్ని సీట్లలో జనసేన విజయం సాధించినా లేక కాంగ్రెస్ అభ్యర్ధిని గెలవనీకుండా చేసినా కూడా తమకు మంచిదే అన్న లెక్కల్లో బీజేపీ పెద్దలున్నారు. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. అది  పార్లమెంట్ ఎన్నికల్లోనూ ప్రభావం చూపిస్తుందన్న ఆలోచనలో ఉన్నారు. అందుకే జనసేనతో కాంగ్రెస్ దూకుడకు చెక్ పెట్టడానికి రెడీ అయ్యారు. మరి బీజేపీ వ్యూహం ఎలా వర్కువుట్ అవుతుందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × five =