మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్ (మా) ఎన్నికలు: మేనిఫెస్టో విడుదల చేసిన మంచు విష్ణు

MAA Elections: Actor Manchu vishnu Releases His Panel Manifesto,Mango News,Mango News Telugu,2021 MAA elections,MAA Election 2021,MAA Elections,MAA Elections 2021,Movie Artist Association,Movie Artist Association Elections,Movie Artist Association Elections 2021,President of the MAA,Tollywood Film industry,Tollywood’s MAA elections,MAA Elections Live Updates,MAA Elections Latest News,MAA Elections News,MAA Elections Live,MAA Elections News,MAA Elections 2021 Latest News,Actor Manchu Vishnu,Manchu Vishnu,Manchu Vishnu Latest News,Manchu Vishnu News,Manchu Vishnu Movies,Manchu Vishnu MAA Elections,Manchu Vishnu MAA Elections 2021,MAA,Manchu Vishnu's Manifesto Highlights,Manchu Vishnu Manifesto,Manchu Vishnu Announces His Panel,Vishnu Manchu Manifesto Press Meet LIVE,Vishnu Manchu Manifesto MAA Elections 2021,Manchu vishnu Panel Manifesto,Manchu Vishnu Panel Members,Manchu Vishnu Releases His Manifesto For MAA Elections 2021,Manchu Vishnu Vs Prakash Raj,Prakash Raj,Prakash Raj Vs Manchu Vishnu,Manchu Vishnu Panel Manifesto Release,#ManchuVishnu,#MAAElections2021

తెలుగు సినీపరిశ్రమకు సంబంధించిన మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్ (మా) ఎన్నికలు అక్టోబర్ 10న జరగనున్నాయి. ‘మా’ అధ్యక్ష పదవికి పోటీచేస్తున్న నటుడు మంచు విష్ణు ఇప్పటికే నామినేషన్ దాఖలు చేసి, తన ప్యానెల్ సభ్యులతో కలిసి ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ‘మా’ కోసం మనమందరం పేరుతో తన ప్యానెల్ కు సంబంధించిన ‘మా’ మేనిఫెస్టోను మంచు విష్ణు విడుదల చేశారు.

‘మా’ ఎన్నికల్లో మంచు విష్ణు మేనిఫెస్టో ఇదే:

  • ‘మా’ సభ్యులకు అవకాశాలు. మా యాప్ క్రియేట్ చేసి, జాబ్ కమిటీ ద్వారా సినిమాల్లో, ఓటీటీల్లో అవకాశాలు కల్పించేలా ప్రయత్నం.
  • అత్యాధునిక సౌకర్యాలతో ‘మా’ సొంత భవనము నిర్మాణం.
  • అర్హులైన ‘మా’ సభ్యులకు శాశ్వత నివాస గృహ నిర్మాణం.
  • ‘మా’ సభ్యులకు వైద్య సహాయం
  • చదువుల తల్లి: అర్హులైన ‘మా’ సభ్యుల పిల్లలకు కేజీ నుంచి పీజీ వరకు విద్యా సహాయం.
  • కల్యాణ లక్ష్మి: అర్హులైన ‘మా’ సభ్యులకు ‘మా’ కల్యాణ లక్ష్మి ద్వారా లక్ష పదహారు వేల ఆర్ధిక సహాయం.
  • మహిళా రక్షణా హైపవర్ కమిటీ.
  • వృద్ధ కళాకారుల సంక్షేమం.
  • ఓటు హక్కు : గౌరవ సభ్యత్వం ఇచ్చిన సీనియర్ సిటిజన్స్ కు ఓటు హక్కు వచ్చేలా ఏజీఎంలో ఆమోదం తెచ్చుకుని అమలు.
  • ‘మా’ మెంబర్ షిప్ కార్డు: కరోనా నేపథ్యంలో ఆర్ధిక ఇబ్బందుల దృష్ట్యా కొంత కాలపరిమితి వరకు ‘మా’ మెంబర్ షిప్ ని రూ.75000 కు తగ్గించి ఇవ్వడం.
  • ‘మా’ ఉత్సవాలు.
  • అర్హులైన కళాకారులందరికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందేలా చర్యలు.
  • మోహన్ బాబు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ద్వారా 50% స్కాలర్ షిప్ తో శిక్షణ.
  • రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో సత్సంబంధాలు నెలకొల్పుకుని, సమస్యల పరిష్కారం, అభివృద్ధి ప్రణాళికలకు సంపూర్ణ సహాయసహకారాల కోసం అభ్యర్ధన.
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + 17 =