ప్ర‌భుత్వ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో18 ఏళ్లు పైబ‌డినవారికి ప్రికాష‌న్‌ డోస్ కు అనుమ‌తించండి: మంత్రి హరీశ్ రావు

Minister Harish Rao Appeals Central Govt to Allow Precautionary Dose for 18+ Years at Govt Vaccination Centers, Telangana Minister Harish Rao Appeals Central Govt to Allow Precautionary Dose for 18+ Years at Govt Vaccination Centers, Harish Rao Appeals Central Govt to Allow Precautionary Dose for 18+ Years at Govt Vaccination Centers, Central Govt to Allow Precautionary Dose for 18+ Years at Govt Vaccination Centers, Central Govt to Allow Precautionary Dose for 18+ Years, Govt Vaccination Centers, Precautionary Dose for 18+ Years, Precautionary Dose, Telangana Minister Harish Rao, Minister Harish Rao, Harish Rao, Telangana Finance Minister Harish Rao, Finance Minister Harish Rao, Precautionary Dose News, Precautionary Dose Latest News, Precautionary Dose Latest Updates, Precautionary Dose Live Updates, Mango News, Mango News Telugu,

నిక్షయ్ మిత్ర క్యాంపెయిన్, రాష్ట్రీయ నేత్ర జ్యోతి అభియాన్, హర్ ఘర్ దస్త్రక్ క్యాంపెయిన్-2.0 పై కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి మనుసుక్ మాండవీయ సోమవారం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వైద్యారోగ్య శాఖ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అధికారులతో కలిసి పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి పలు విజ్ఞప్తులు, సూచనలు చేశారు. ముఖ్యంగా రాష్ట్రంలో కరోనా వాక్సినేషన్, టీబీ నిర్మూలన, కంటి పరీక్షల కార్యక్రమాల గురించి వివరించారు. ఈ సందర్భంగా ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో వ్యాక్సినేషన్ కేంద్రాల్లో ప్రికాష‌న్‌ డోస్ కు అనుమ‌తించాలని కేంద్రాన్ని కోరారు.

ప్ర‌భుత్వ కేంద్రాల్లో 60 ఏళ్లు దాటిన వారికి ప్రికాష‌న‌రీ డోస్ కొనసాగిస్తున్న కేంద్రం, 18 ఏళ్లు పైబ‌డిన వారికి ఏప్రిల్ 10 నుంచి ప్రికాష‌న‌రీ డోస్ ఇచ్చేందుకు కేవ‌లం ప్రైవేటు ఆసుప‌త్రుల‌కే అనుమ‌తించింది. ఈ క్ర‌మంలో ప్రైవేటుతో పాటు ప్ర‌భుత్వ కేంద్రాల్లోనూ 18-59 ఏళ్ల వ‌య‌సు వారికి ప్రికాష‌న‌రీ డోస్ ఇచ్చేందుకు అనుమ‌తించాల‌ని కేంద్రానికి మంత్రి హరీశ్ రావు గతంలో రెండు సార్లు లేఖ రాయగా, నేటి వీడియో కాన్ఫరెన్స్ లో మరోసారి కేంద్రాన్ని కోరారు. రాష్ట్రంలో 32 లక్షల డోసుల నిల్వ ఉందని, గడువు తేదీ ముగిసే అవకాశం ఉందని అన్నారు. పలు రాష్ట్రాల్లో కొత్త వేరియంట్ల రూపంలో క‌రోనా వ్యాప్తి పెరుగుతున్న క్రమంలో రెండు డోసులు పూర్తి చేసుకొని అర్హులైన వారికి ప్రికాష‌న‌రీ డోస్ ఇవ్వడం వల్ల వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడం సాధ్యమవుతుందన్నారు.

ఇక తెలంగాణలో వాక్సినేషన్ కార్యక్రమం వేగంగా జరుగుతుందని మంత్రి హరీశ్ రావు కేంద్ర మంత్రికి వివరించారు. జూన్ 3న రాష్ట్రంలో ప్రారంభమైన ఇంటింటికి వాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా పది రోజుల్లో 1.30 లక్షల మందికి కరోనా వాక్సిన్ వేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో 12 ఏళ్లు పై బడిన వారికి మొదటి డోసు 104.78%, రెండో డోసు 99.72% పంపిణీ జరిగినట్టు పేర్కొన్నారు. టీబీ నిర్మూలన కోసం అమలు చేస్తున్న నిక్షయ్ మిత్ర కార్యక్రమాన్ని స్వాగతిస్తున్నామని, రాష్ట్రంలో విజయవంతంగా అమలు చేస్తామని చెప్పారు. కంటి ఆపరేషన్లు మరింత పెంచేలా టీచింగ్ ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రుల్లో పేఖో మిషన్లు సమకూర్చి, లక్ష్యాన్నిచేరుతామని మంత్రి హరీశ్ రావు తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six − six =