ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు

Minister Harish Rao Launched Arogya Mahila Scheme at Urban Primary Health Center Karimnagar,Minister Harish Rao,Harish Rao Launched Arogya Mahila Scheme,Urban Primary Health Center,Mango News,Mango News Telugu,Arogya Mahila to Start on March 8th,100 Health Centers Across Telangana,57 Types of Medical Tests will be Conducted,Arogya Mahila,Arogya Mahila Telangana,Telangana Arogya Mahila,Arogya Mahila Latest News,Arogya Mahila Updates,Arogya Mahila News and Updates,Arogya Mahila Latest News and Updates,Telangana CM KCR

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ మహిళా దినోత్సవం (మార్చి 8) సందర్బంగా మరో నూతన కార్యక్రమాన్ని ప్రారంభించింది. నేటి నుండి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 100 ఆరోగ్య కేంద్రాల్లో ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు బుధవారం ఉదయం కరీంనగర్ అర్బన్ హెల్త్ సెంటర్ లో ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆరోగ్య మహిళ కింద ప్రతీ మంగళవారం ప్రాథమిక వైద్య కేంద్రాల్లో మహిళలకు ప్రత్యేకంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అక్కడికక్కడే తగు మందులు ఇవ్వడంతో పాటు అవసరమైన వారిని రెఫరల్ ఆసుపత్రులకు పంపించనున్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో అన్ని వయస్సుల మహిళలకు 57 రకాల వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్, పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ ఆరోగ్య మహిళ కార్యక్రమం యొక్క అవసరం, చేసిన ఏర్పాట్లు, ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత గురించి వివరించారు. ఆరోగ్య మహిళ కార్యక్రమంలో ప్రధానంగా ఎనిమిది ప్యాకేజీలుగా విభజించి వైద్య పరీక్షలు, చికిత్స‌లు అందించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని మొదటి దశలో 100 ఆరోగ్య కేంద్రాల్లో చేపడుతున్నామని, రాబోయే రోజుల్లో మరిన్ని పెంచుతామని తెలిపారు. కరీంనగర్ లో ప్రారంభించిన ఆరోగ్య మ‌హిళ కేంద్రంలో మ‌హిళా సిబ్బంది మాత్ర‌మే ఉంటార‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు. గతం నుంచే మ‌హిళ‌ల సంక్షేమ కోసం ఆరోగ్య ల‌క్ష్మి, కేసీఆర్ కిట్, కళ్యాణలక్ష్మీ చేపట్టామని, తాజాగా ఆరోగ్య మ‌హిళ అనే కొత్త కార్యక్రమాన్ని తీసుకొచ్చామ‌ని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేకంగా ఆరోగ్య మహిళా హెల్ప్ డెస్క్లు కియాస్కి లను కూడా ఏర్పాటు చేసినట్టు మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని మహిళలు ఉపయోగించుకోవాలని మంత్రి కోరుతూ, మహిళలు ఆరోగ్యవంతులుగా ఉండాలనేదే తెలంగాణ ప్రభుత్వం లక్ష్యం అని పేర్కొన్నారు. త్వరలోనే రాష్ట్రంలో కేసీఆర్ న్యూట్రిషియన్ కిట్ పథకాన్ని కూడా ప్రారంభించనున్నట్టు మంత్రి హరీశ్ రావు వెల్లడించారు.

ఆరోగ్య మహిళ కార్యక్రమం వివరాలు:

  • మధుమేహం, రక్తపోటు, రక్తహీనత, ఇతర సాధారణ పరీక్షలు నిర్వహణ
  • ఓరల్, సర్వైకల్, రొమ్ము క్యాన్సర్ల స్క్రీనింగ్
  • థైరాయిడ్ పరీక్ష, సూక్ష్మ పోషకాల లోపాలను గుర్తించడం. అయోడిన్ సమస్య, ఫోలిక్ యాసిడ్, ఐరన్ లోపంతో పాటు, విటమిన్ బీ12, విటమిన్ డి పరీక్షలు చేసి చికిత్స, మందులు అందజేయడం
  • మూత్రకోశ సంబంధిత ఇన్ఫెక్షన్లు, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ వ్యాధుల పరీక్షలు
  • మెనోపాజ్ దశకు సంబంధించి పరీక్షల అనంతరం అవసరమైన వారికి హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ చేయడంతోపాటు కౌన్సిలింగ్ తో కూడిన అవగాహన కల్పించడం
  • నెలసరి సమస్యలపై పరీక్షలు చేసి వైద్యం అందించడం, సంతాన సమస్యలపై ప్రత్యే కంగా పరీక్షలు చేసి అవగాహన కలిగించడం, అవసరమైనవారికి ఆల్ట్రాసౌండ్ పరీక్షలు
  • సెక్స్ సంబంధిత అంటువ్యాధుల పరీక్షలు చేసి అవగాహన కల్పించడం, అవసరమైన వారికి వైద్యం అందించడం
  • బరువు నియంత్రణ, యోగా, వ్యాయామం వంటివాటిపై అవగాహన కలిగించడం, ఉచితంగా అన్ని రకాల వైద్య పరీక్షలు, ప్రత్యేక యాప్ ద్వారా మానిటరింగ్.

 

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here