కేసీఆర్,కేటీఆర్ మధ్య దూరం పెరుగుతోందా?

Is The Distance Between KCR and KTR Increasing, Distance Between KCR and KTR, KCR and KTR Distance, KCR and KTR, KCR Family, What Is Happening In The KCR Family, KCR, KTR, Latest KCR and KTR News, KCR and KTR News Update, BRS, Latest BRS News,Polictical News, Elections, Mango News, Mango News Telugu
KCR Family,What is happening in the KCR family?, distance between KCR and KTR,KCR, KTR

కొద్దిరోజులుగా కల్వకుంట్ల ఫ్యామిలీలో విభేదాలు పెరుగుతున్నట్లే కనిపిస్తున్నాయి. కేటీఆర్ లోకసభ నియోజకవర్గాల సమీక్షలకు హాజరు కాకపోవడంతో ఈ అనుమానాలు మరింత బలపడుతున్నాయి. నియోజకవర్గాల సమీక్షలన్నీ హరీష్ రావు చేతుల మీదుగానే నడుస్తున్నాయి. అయితే రాకపోవడానికి ఆయన  గొంతు నొప్పితో బాధపడుతున్నట్లు చెబుతున్నారు. అయితే దీనివెనుక వేరే కారణాలున్నాయన్న వార్తలు వినిపిస్తున్నాయి.

త్వరలో రానున్న లోక్ సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై మాజీ సీఎం కేసీఆర్ ఆలోచనలతో..  కేటీఆర్ ఏకీభవించలేకపోతున్నారని, అందుకే తండ్రీకొడుకుల మధ్య గ్యాప్ పెరుగుతుందన్న టాక్ నడుస్తోంది. లోక్ సభ ఎన్నికలలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో కలిసి వెళ్లాలని కేటీఆర్ భావిస్తున్నారట. అయితే ఈ విషయంపై కేసీఆర్ అనుమతి లేకుండా తనకు బాగా క్లోజ్ అయిన బీజేపీ నేత, గోవా సీఎం ప్రమోద్ సావంత్ ద్వారా బీజేపీ హై కమాండ్‌కు బీఆర్ఎస్ తరపున పొత్తుల ప్రతిపాదన తీసుకెళ్లారట.

కానీ ఈ విషయం తెలిసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. కేటీఆర్ మీద మండిపడ్డారన్న వార్తలు వినిపిస్తున్నాయి.  బీజేపీతో బయటకు కనిపించని రాజకీయ స్నేహం వరకూ ఓకే కానీ.. నేరుగా పొత్తు పెట్టు పెట్టుకోవడం అంటే పార్టీ నేలకు దిగడమే అని, తనకు తెలియకుండా పొత్తు ప్రతిపాదనలు ఎందుకు చేయాల్సి వచ్చిందని కేటీఆర్ పై కేసీఆర్ ఫైర్ అయ్యారట. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోవడం అంటే ఆత్మహత్య లాంటిదని కేసీఆర్ చెప్పారట.

కానీ కేటీఆర్ మాత్రం కేసీఆర్ ఆలోచనా విధానాన్ని దీనికి ఒప్పుకోలేదని.. ఇప్పుడు పొత్తు పెట్టుకోకపోతే అంతకంటే ముందే పార్టీ అదృశ్యం అయిపోతుందని ఆందోళన చెందుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి .  ఎందుకంటే కేంద్రంలో, రాష్ట్రంలో వేరు వేరు పార్టీలు..ఈ రెండూ కూడా జాతీయ పార్టీలే కావడంతో వీటిని ఎదుర్కోవడం అంత ఈజీ కాదని.. లోక్‌సభ ఎన్నికల్లో తేడా వస్తే పార్టీని కాపాడుకోవడం చేతులు కాలాక ఆకులు పట్టుకోవడమేనని  కేటీఆర్ భావిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ భవిష్యత్తును కాపాడుకుంటేనే తనతో పాటు బీఆర్ఎస్ నేతల రాజకీయ భవిష్యత్తును కాపాడుకున్నట్లు అవుతుందని ఆయన అనుకుంటున్నారు.

కానీ కేసీఆర్ మాత్రం బీజేపీతో పొత్తు వద్దంటే వద్దని కూర్చుంటున్నారు.  ఈ వ్యవహారంలో కేటీఆర్ అసంతృప్తికి గురి కావడం వల్ల లోక్ సభ నియోజకవర్గాల సమీక్షలకు దూరంగా ఉంటున్నారనే ప్రచారం జరుగుతుంది. అంతేకాకుండా ఇటీవల ఏపీ సీఎం జగన్.. కేసీఆర్ ను పరామర్శించడానికి వచ్చినప్పుడు కూడా కేటీఆర్ చాలా డల్ గా ఉన్నారు. తర్వాత నుంచి  నియోజకవర్గాలలో జరిగే ఏ సమీక్షలకు కేటీఆర్ హాజరు కావడం లేదు. గొంతు నొప్పి అంటూ కారణం చెప్పి సైలెంట్ గా ఉంటున్నారు.

అంతేకాదు కేటీఆర్ లోక్‌సభకు పోటీ చేయడానికి కసరత్తు ప్రారంభించినట్లుగా బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.  కేటీఆర్ ఇప్పటికే సికింద్రాబాద్ లేదా మల్కాజిగిరి నియోజకవర్గాలపై దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది.ఈ రెండిట్లోనూ అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ  మంచి ఫలితాలనే సాధించడంతో..అక్కడ పోటీ చేస్తే విజయం ఖాయమని అంచనా వేస్తున్నారు. అయితే ఈ రెండు చోట్లా పార్లమెంట్ ఎన్నికలలో  బీఆర్ఎస్ ఇంతవరకు గెలవలేదు. కానీ సికింద్రాబాద్ నుంచి కేటీఆర్ పోటీ చేయాలని భావిస్తున్నారట.  ఒకవేళ కేటీఆర్ కనుక లోక్‌సభకు పోటీ చేస్తే కేసీఆర్ లేదా కవితలో ఒకరు తప్పుకోవాల్సి వస్తుంది.

కేసీఆర్ మెదక్ నుంచి పోటీ చేయాలని.. కవిత ఎప్పటిలాగే నిజామాబాద్ నుంచే బరిలోకి దిగుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు కేటీఆర్ పోటీ చేస్తే అందరూ పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేసినట్లు అవుతుంది. తెలంగాణ రాజకీయాలు చూసుకుంటారని అంతా భావిస్తున్న టైములో కేటీఆర్ నిర్ణయం కేసీఆర్ ఫ్యామిలీని ఇరుకున పెట్టేదిలాగే కనిపిస్తుంది.  ఇదిలా ఉండగా కేసీఆర్ వేగంగా కోలుకుంటున్నారని హరీష్ రావు చెప్పారు. అంతేకాదు ఫిబ్రవరి నుంచి తెలంగాణ భవన్ కు వచ్చి అన్ని కార్యక్రమాలను ఆయన చూసుకుంటారని  చెప్పడంతో  కేసీఆర్ పూర్తిస్థాయిలో యాక్టివ్ అవుతారని కేటీఆర్ ప్రాధాన్యత అంత ఉండదని హరీష్ రావు చెప్పకనే చెప్పినట్లుగా అయిందని అంటున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × two =