19.8 మెగా వాట్ల వేస్ట్ టూ ఎన‌ర్జీ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి కేటిఆర్

19.8 MW Capacity Waste to Energy Plant at Jawahar Nagar, Energy Plant at Jawahar Nagar, Hyderabad, Jawahar Nagar, KTR inaugurate WTE plant, KTR launch first south Indian Waste to Energy plant, KTR to inaugurate Waste to Energy plant, Minister for IT, Minister KTR, Minister KTR Inaugurates 19.8 MW Capacity Waste to Energy Plant, Waste to Energy Plant, Waste to Energy Plant at Jawahar Nagar

మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా జవహర్ నగర్ లో నిర్మించిన 19.8 మెగా వాట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన చెత్త నుండి విద్యుత్ ఉత్పత్తి చేసే కేంద్రాన్ని మంగళవారం నాడు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కే.టీ.రామారావు ప్రారంభించారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, నగర మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దక్షణ భారత దేశంలోనే మొట్ట మొదటిగా వ్యర్థాలతో విద్యుత్‌ ఉత్పత్తి చేసే (వేస్ట్ టూ ఎనర్జీ) ప్లాంట్ ను ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటిఆర్ మాట్లాడుతూ, వచ్చే 18 నెలల్లో ఇదే సైట్లో మరో 28 మెగావాట్ల మేర సామర్ధ్యానికి విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అలాగే దుండిగల్ వద్ద మరో 15 మెగావాట్ల ప్లాంట్ కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. దీంతో మొత్తం 63 మెగావాట్ల వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్ల సామర్థ్యంతో 2030 వరకు నగరంలో వ్యర్థాలను శుద్ధి జరగనుందని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 − 4 =