కరోనా కంటైన్మెంట్‌ జోన్ల పరిధిలో మంత్రి కేటీఆర్‌ పర్యటన

Corona Containment Zones, Coronavirus, Coronavirus Breaking News, Coronavirus Latest News, Coronavirus Live Updates, Coronavirus updates Live, COVID-19, India COVID 19 Cases, KTR Visited Hyderabad Corona Containment Zones, Minister KTR, telangana, Telangana Coronavirus, Telangana Coronavirus Deaths, Total COVID 19 Cases

కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా హైదరాబాద్ నగరంలో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న ప్రాంతాలను కంటైన్మెంట్‌ క్లస్టర్లుగా గుర్తించిన సంగతి తెలిసిందే. ఈ ప్రాంతాల్లో తెలంగాణ ప్రభుత్వం, జీహెచ్ఎంసీ సంయుక్తంగా దృష్టి సారించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్‌, మల్లేపల్లి, ఆసిఫ్‌నగర్‌ పరిధిలోని కంటైన్మెంట్‌‌ జోన్లలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ ఈ రోజు పర్యటించారు.

ఆ ప్రాంతాల్లోని ప్రజలతో మాట్లాడి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ జోన్ లలో ప్రజల ఇంటి వద్దకే అవసరమైన వస్తువులను సరఫరా చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని, ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని కోరారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలని, ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ప్రజలందరూ సహకరించాలని మంత్రి కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు. ఈ పర్యటనలో వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బందితో కూడా కేటిఆర్ ముచ్చటించారు. వారి సేవలకు ధన్యవాదాలు చెబుతూ, ఇలాగే మరింతగా సేవ ప్రయత్నాలు కొనసాగించమని కోరారు. ఈ పర్యటనలో మంత్రి కేటిఆర్ తో పాటుగా జీహెఛ్ఎంసీ కమిషనర్, ఖైరతాబాద్ జోనల్ కమిషనర్, తదితరులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − four =